Saturday, September 30, 2023

బాస్కెట్‌బాల్ దిగ్గజం.. కోబ్ బ్రయంట్ మృతి…

- Advertisement -
- Advertisement -

Kobe-Bryant

వాషింగ్టన్: ప్రముఖ అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్(41)కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బ్రయంట్ తన కూతురు జియానా(13)తో పాటు మరో 9మంది కలిసి ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ లాస్ ఏంజెల్స్ లోని ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడ్డారు. కోబ్ బ్రయంట్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మంత్రి కెటిఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బాస్కెట్ బాల్ చరిత్రలో బ్రయంట్ ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. దుసార్లు ఎన్ బిఎ ఛాంపియన్ గా నిలిచాడు. రెండు సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టుగా నిలిచాడు.

 

Basketball legend Kobe Bryant dies in helicopter crash
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News