Monday, April 29, 2024

9 నుంచి బతుకమ్మ చీరలు

- Advertisement -
- Advertisement -

Bathukamma Sarees Distribution from October 9

ఆడపడుచుకు చీర.. చేనేతకు చేయూత
 మహిళా సంఘాలతో ఇంటింటికి
అందజేత 287 డిజైన్లు.. వివిధ
వర్ణాలతో బతుకమ్మ చీరల ప్రదర్శన
నాలుగేళ్లలో రూ.1000కోట్లు చీరలపై
వెచ్చింపు టూరిజం ప్లాజాలో
మంత్రులు కెటిఆర్, సత్యవతి రాథోడ్,
సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో
బతుకమ్మ చీరల ప్రదర్శన

మన తెలంగాణ/హైదరాబాద్ : బతుకమ్మ పండగను రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఏటా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ పరంపరలో భాగంగా ప్రస్తుత సంవత్సరం కూడా చీరలను పంపిణి చేయనున్నామన్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి చీరలను పంపిణీ చేయడానికి సుమారు కోటి చీరలను సిద్ధం చేశామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గత సంవత్సరం 100 డిజైన్లు, అయితే ఈ సంవత్సరం 287 డిజైన్లతో చీరలను తయారు చేయించామన్నారు.

ఈ చీరలతో మహిళలంతా పెద్దఎత్తున ఆనందిస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మౌలిక అంశాల మీద రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏ రకమైన పరిష్కారాలు వస్తాయనేదానికి తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్ష నిదర్శమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. ప్రధానంగా రైతు ఆత్మహత్యలను అత్యంత వేగంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో రైతన్న ఆత్మహత్యలు లేవు… నేతన్న ఆత్మహత్యలు లేవని, ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తొలగించిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిందన్నారు. ఢిల్లీలో మాకు అనుకూల ప్రభుత్వం లేదన్నారు. నిజానికి వారు టిఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యర్ధులన్నారు. అయినప్పటికీ నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి వారిదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరల ప్రదర్శనను మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హరిత హోటల్‌లో ఏర్పాటు చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సునితా లకా్ష్మరెడ్డి, టెస్కో డైరెక్టర్ శైలజా అయ్యర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్యల పట్ల దృష్టి సారించి, దీర్ఘకాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు కోసం మొదటి నుంచి పరితపించిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని అన్నారు. గతంలో ఆయన కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో పెద్దఎత్తున ఆత్మహత్యలు ఉండేవ్నారు.

దీనిపై అప్పట్లో గోడల మీద ‘నేతన్నా… ధైర్యంతో ఉండు, మరణించవద్దు, ఆత్మహత్యలు మంచిది కాదు అని రాతలు కనిపించేవన్నారు. ఆ పరిస్థితి చూసి కెసిఆర్ చలించారన్నారు. ఒక రోజు సిరిసిల్లలో ఏడుగురు నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఆనాడు ఉద్యమ నాయకుడిగా,టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ పార్టీ తరపున 50 లక్షల రూపాయలను నేతన్నల సంబంధించిన సొసైటీకి ఇచ్చి మైక్రో రుణాలు ఇవ్వమన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ నేతన్నల సమస్యలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా రూ.1200 కోట్ల బడ్జెట్‌ను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చేనేత, జౌళి శాఖకు ఇచ్చారన్నారు. శాఖకు ఆయనే స్వయంగా చాలా కార్యక్రమాలు డిజైన్ చేసి మార్గనిర్ధేశనం చేశారని మంత్రి కెటిఆర్ అన్నారు.

సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ ప్రాంతాల్లో పవర్ లూమ్స్ కు చేతినిండ పనికల్పిస్తే నేతన్నకు ఢోకా ఉండదని, ఇవాళ 10,12వేలు సంపాదించే నేతన్నలకు భద్రత, ఉపాధి కల్పిస్తే నెలకు రూ. 8వేలు సంపాదించే వారు రూ. 20వేలు సంపాదిస్తారని, అలాగే రూ. 15వేలు సంపాదించేవారు రూ. 25వేలు సంపాదిస్తారని భావించారన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సేట్లను పిలిపించి లాభాలతో పాటు నేతన్నలకు జీతం పెంచేందుకు ఒప్పుకుంటేనే ప్రభుత్వ పక్షాల పెద్దఎత్తున ఆర్డర్ ఇస్తామని సిఎం కెసిఆర్ చెప్పి ఒప్పించారన్నారు. దీని కింద ప్రతి సంవత్సరం కోటి చీరలు అందించాలని చేనేత, జౌళి శాఖకు కూడా లక్ష్యం పెట్టారన్నారు. ఇందులో భాగంగా 2017లో మొదలైన బతుకమ్మ చీరల పంపిణీని ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. ఆ సంవత్సరంలో రూ. 228 కోట్లను ప్రభుత్వం వెచ్చించగా, 2018లో రూ.280 కోట్లు, 2019లో రూ. 313 కోట్లు, ప్రస్తుత సంవత్సరంలో రూ 317.81 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. . బతుకమ్మ చీరల మీదనే నాలుగేళ్లలో ప్రభుత్వం రూ. 1033 కోట్లను ఖర్చు చేసిందని ఆయన వివరించారు.

పవర్ లూమ్ అప్ గ్రెడెషన్ స్కీంతో మారిన దశ

బతుకమ్మ చీరల కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు సిరిసిల్ల పవర్ లూమ్స్ అవుట్ డేటెడె లూమ్స్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. అవి ముతక చీరలకే పనికొచ్చేవన్నారు. మంచి నాణ్యత ఉన్న చీరలు ఏ విధంగా నేయాలనే అంశంపై నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్ గ్రెడేషన్ స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ వేల సంఖ్యలో లూమ్స్ అప్ గ్రేడ్ చేశామన్నారు. దీనివల్ల నాణ్యమైన చీరలు అనేక డిజైన్లలో చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు చీరలు నచ్చడం అంచే అంత సులవైన విషయం కాదన్నారు. రంగుల చీరలను నేస్తున్న కారణంగా ఇతర రాష్ట్రాల ఆర్డర్లు కూడా మన నేతన్నలకు వస్తున్నాయన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో నేతన్న భవిష్యత్ భద్రంగా ఉంటుందన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయుత పథకాలైనా, నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా… అవన్నీ తెలంగాణలోనే జరుగుతున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వానికి మతపరమైన ఎజెండా లేదన్నారు. రంజాన్, క్రిస్మస్‌లకు కూడా చీరలు ఇస్తున్నామన్నారు. పేదరికం అన్ని మతాల్లోనూ ఉంది… కాబట్టే అన్ని మతాల పండగలకు చీరలు ఇస్తున్న గొప్ప సంస్కార ప్రభుత్వం తెలంగాణదన్నారు.

సంక్షోభంలోనూ… సంక్షేమం ఆగలే

కరోనా సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమం ఆగలేదని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైతులకు రైతుబంధు రూపంలో రూ.7279.58 కోట్లు వారి బ్యాంకు అకౌంట్‌లో వేశామన్నారు. అలాగే రైతుబీమా కింద రూ. 1141 కోట్ల, ఆసరా పెన్షన్లకు ప్రతి నెల దాదాపు రూ.1000 కోట్లు ఇస్తున్నామన్నారు. కళ్యాణలక్మీ, షాదీ ముబారక్, పిల్లల స్కాలర్ షిప్‌లు సైతం ఆపలేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News