Saturday, May 4, 2024

యువత ఉపాధికి మెరుగైన శిక్షణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Better training for youth employment: Srinivas Goud

 

హైదరాబాద్ : యువత ఉపాధి అవకాశాలకు ఆధునిక శిక్షణ, వ్యక్తిగత వికాసం పెంపొందించాలని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో వరల్డ్ యూత్ స్కిల్స్ డే పురస్కరించుకొని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) సిఈఓ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో టాస్క్ సంస్థ ద్వారా ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ, పిజి చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు,అవసరమైన శిక్షణను అందిస్తున్నామని మంత్రికి వారు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 32 కళాశాలల నుంచి సుమారు 7600 మంది విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొంత మంది అభ్యర్థులకు వివిధ కంపెనీలలో నియమాకాలు పొందారని మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కెటిఆర్ చొరవతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో 400 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఐటి పార్క్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ పార్క్‌లో టాస్క్ సంస్థకు దాదాపు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేటాయించారని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాన్ని అక్టోబర్- 22లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో టాస్క్, టి స్టెప్‌ల ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ ఎండిలతో టాస్క్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News