Saturday, April 27, 2024

ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రద్దు పై భగ్గుమన్న ఏబివిపి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: నిజాంకళాశాలలో ఉన్న ఎంఎస్‌సి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రద్దును ఉపసంహరించుకోవాలంటూ ఎబివిపి నాయకులు విద్యార్థులతో కలసి ధర్నా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈధర్నాలో ఏబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృద్వి తేజ మాట్లాడుతూ డిమాండ్ ఉన్న కెమిస్ట్రీ కోర్సును తీసివేయాలనే అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాన్నారు.

పేద విద్యార్థులకు విద్యనందించాల్సిన ప్రభుత్వ యూనివర్శిటీలు లాభనష్టాల గురించి మాట్లాడడం సిగ్గుచేటని వాపోయారు.ఈనిర్ణయం ఉపసంహరించుకోకుంటే విద్యార్థులతో కలసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.గతంలో కళాశాల ప్రిన్సిపాల్ భీమానాయక్‌కు ఏబివిపి ఆధ్వర్యంలో కలిసి విద్యార్థుల నిర్ణయాన్ని వినతిపత్రం రూపంలో తెలిపామన్నారు.అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా తన ఇష్టానుసారం ముందుకుపోతుండడం తో ఏబివిపి , విద్యార్థులతో కలిసి ఆందోళన బాటపట్టిందని గోల్కోండ జిల్లా కన్వీనర్ శ్రవణ్ పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో కళాశాల నాయకులు ననీన్ ,నరేందర్,సాయి,కమల్,దీక్షిత,గురువారెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News