Friday, April 26, 2024

భారత్ బంద్ మిశ్రమ ప్రభావం

- Advertisement -
- Advertisement -

Bharat Bandh

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవంత్సరంపాటుగా నిరసనలు తెలుపుతున్నారు. ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు రైతు సంఘాలు ‘భారత్ బంద్’ పాటిస్తున్నాయి.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడమేకాక బంద్ విజయవంతం అయింది. కాగా తెలంగాణలో పాక్షికంగానే విజయవంతం అయింది. హైదరాబాద్‌లో రైతు సంఘాల నాయకులు బస్ డిపోల వద్ద నిరసనలు తెలిపినపటికీ ట్రాఫిక్ యథాప్రకారం కొనసాగింది. ముంబయిలో కూడా పెద్దగా ప్రభావం కనపడలేదు. దుకాణాలు, రవాణా యథాప్రకారం నడిచాయి. కాగా రైతు సంఘాలు నిర్వహిస్తున్న ‘భారత్ బంద్’కు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, ఎస్‌పి, బిఎస్‌పి,టిఎంసి, ఆప్, వైఎస్‌ఆర్‌సిపి, వామపక్షాలు మద్దతు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News