Saturday, April 27, 2024

దిగ్బంద్ దిగ్విజయం

- Advertisement -
- Advertisement -

రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్

కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం

ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక హక్కు
కేంద్రానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకపోవడం దురుదృష్టకరం
మద్దతు ధరపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి
కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులతో పోరాడలేని దుస్థితిలో రైతులు చిక్కుకుంటారు

వారి జీవితాలే ప్రశ్నార్థకం అవుతాయి
కేంద్ర చట్టాలు రైతులకే కాదు దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలందరికీ హానికరం
కార్పొరేట్ శక్తులు పంటలను స్వాధీనం చేసుకుని ధరలు కూడా పెంచేస్థాయి
రైతుబంద్‌లో భాగంగా షాద్‌నగర్ వద్ద బూర్గుల జాతీయ రహదారిపై బైఠాయించిన
సందర్భంలో మంత్రి కెటిఆర్ ప్రకటన

బంద్‌లో పాల్గొని ధర్నాలకు నాయకత్వం వహించిన ఎంఎల్‌సి కవిత, మంత్రులు హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు, భారీగా పాల్గొన్న టిఆర్‌ఎస్ కార్యకర్తలు

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్లచట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమాలు ఉవ్వెత్తున నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఒంటరివారు కాదు వారికి తెలంగాణ రైతులు, టిఆర్‌ఎస్ పూర్తిగా మద్దతు పలుకు తుందని ఆయనచెప్పారు. కేంద్రం నల్ల చట్టాలను విరమించేంత వరకు తెలంగాణలోని గ్రామగ్రామాల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ దేశవ్యాప్తంగా నిర్వహించన భారత్‌బంద్‌లో భాగంగా చేస్తూ రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలపరిధిలోని బూర్గుల జాతీయ రహదారిపై బైటాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రవేశపెట్టన రైతు చట్టాలతో దేశంలోని రైతులు కంటకన్నీరు పెడుతున్నారు. ఇది ఈ దేశానికి మంచిది కాదన్నారు. ఎన్నికలు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కావున రాజకీయాలకు అతీతంగా రైతుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కేంద్రం తీసుకువచ్చిన నల్లచట్టాలను ఉపసంహరించు కునేంతవరకు రాష్ట్రంలో ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, మండలంలో రైతాంగ పోరాటాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమై దశలవారి ఆందోళనలను ఖరారు చేయనున్నట్లు కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వాలు ఏ వైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి నచ్చకపోతే ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలందరి పైనా ఉంది. ప్రజల ఆలోచనలు, వారి అభిప్రాయాలను పాలక వర్గాలు పరిశీలించి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాల్సిన అవకాశాలు కూడా ఉంటాయనే విషయం కూడా కేంద్రానికి తెలియడంలేదన్నారు. కేంద్రానికి ప్రజాస్వామ్యస్ఫూర్తి లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లును ఉపసంహరించుకోవాలని ఢిల్లీ పురవీధుల్లో గతకొద్ది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించడంలేదు. పార్లమెంట్‌లో మందబంలం ఉందని రైతుబిల్లును కేంద్రం ఆమోదం చేసుకుంది, రాజ్యసభలో బిజెపికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, టిఆర్‌ఎస్ వ్యతిరేకించినా అప్రజాస్వామికంగా ఓటింగ్‌పెట్టకుండా రైతుబిల్లును కేంద్రం ఆమోదింపచేసు కుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికార మదంతో రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తీసుకువచ్చింది.

కేంద్రం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాల్లో రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ఒక్కమాట కూడాలేదు. కర్షకులు కావాలా? కార్పొరేటు శక్తులు కావాలాని అడిగితే కేంద్రం కార్పొరేట్ శక్తులనే కోరుకుంటుందని కెటిఆర్ నిందించారు. పండించిన పంటలకు బీమా ఇవ్వాలని రైతులు కోరుతున్నప్పటికీ కేంద్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చే ఆలోచన నుంచి కూడా కేంద్రం తప్పుకుందని నిందించారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు శక్తుల చేతుల్లో రైతులను పెడితే రైతుల పరిస్థితి ఏమిటని కెటిఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పంటలను ఎవరుకొన్నా కనీస ధర విషయంలో రైతులకు చట్టపరమైన భద్రత కల్పిస్తామని ఎందుకు చెప్పడంలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ దేశంలోని సామాన్యరైతు పరిస్థితికూడా కేంద్రానికి అర్థం కావడంలేదన్నారు. భారతదేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఎకరం,అర ఎకరం భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని కెటిఆర్ చెప్పారు. ఈ చిన్న సన్నకారు రైతులకు కార్పొరేటు శక్తులతో కొట్లాడే శక్తి ఉంటుందాని కెటిఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులకు కనీసం మద్దతు ధర కల్పించకుండా రైతులు పండించే పంటల ధరలు నిర్ణయించే వ్యక్తులు,శక్తులు కార్పొరేటు సంస్థలైనప్పుడు రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రైతుల్లో విశ్వాసం రావాలంటే ప్రభుత్వం కొనగోలు చేయాలి
కేంద్రం రైతులపై కక్షకట్టిన ధోరణీల్లో వ్యవహరిస్తుందని కెటిఆర్ దుయ్యబట్టారు. భారత దేశరైతాంగం కోరుతున్న మద్దతు ధరపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండే చేశారు.రైతులు ఆందోళనలు చేస్తున్నా, బంద్‌లు పాటిస్తున్నా ఉలుకు పలుకులేని కేంద్రానికి ఉద్యమాలతోనే గుణపాఠం చెప్పాలని కెటిఆర్ పిలపునిచ్చారు. దేశంలోని కోట్లాది మంది రైతులు తీవ్ర ఆందోళనచెదుతుంటే కేంద్రం కనీసం ఎందుకు స్పందించడంలేదని ఆయన నిలదీశారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటలను మార్కెట్‌కమిటీల ద్వారా రాష్ట్ర భుత్వాలు కొనుగోలు చేస్తుంటే రైతులకు లాభసాటి ధరలభిస్తుండటంతో పాటుగా రైతుకు భరోసా లభిస్తుందని కెటిఆర్ చెప్పారు. అయితే రైతుబిల్లును అమలు చేసి కేంద్రం రాష్టాలపై ఆంక్షలు విధిస్తే రైతుల పరిస్థితి ఏమిటని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రైతు చట్టం అమల్లోకు వస్తే కనీస మద్దతు ధరకోసం సామాన్యబక్కచిక్కిన రైతులు కార్పొరేటు శక్తులతో కొట్లాడే పరిస్థితి ఉంటుందాని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం రైతుచట్టాన్ని అమలుచేసి మార్కెట్ కమిటీలను రద్దు చేస్తాము, రైతులకు మద్దతు ధర ఇవ్వం, రాష్ట్రాలు రైతుల పంటలను కొనవద్దు అన్నీ మేము చూసకుంటామని కేంద్రం అంటుంటే రైతుల జీవితాలే ప్రశ్నార్థకమవుతాయని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యరైతులు తమపంటలను ఎక్కడ అమ్ముకుంటారు?
రాష్ట్రప్రభుత్వాలు రైతుల ధాన్యం కోనుగోలు చేయవద్దు, కేంద్రం అనుమతి ఇస్తేనే పంటలు కొనుగోలు చేయాలి, రైతులు ఎక్కడైనా పంటలను అమ్ముకోవచ్చు, ఏదేశానికైనా పంపించవచ్చని కల్లబొల్లి మాటలు చెపుతున్నా కేంద్ర మంత్రులు ఒకప్రశ్నకు సూటిగా సమాధానం చెపుతారని కెటిఆర్ ప్రశ్నించారు. ఎకరమో,అర ఎకరమో ఉన్న రైతు తన పంటలను విదేశాలకు ఎగుమతి ఎలా చేయ గలుగుతాడన్నారు. కార్పొరేటు సంస్థలు ఇచ్చిన రేటు తీసుకుని నోరు మూసుకుని రైతులు కూర్చోవల్సి వస్తుందన్నారు. చిన్నకారు రైతులు తమపంటలను దేశంలోని మరోప్రాంతానికి తీసుకువెళ్లి అమ్ముకునే పరిస్థితి ఉంటుందాని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. రైతులు ఎక్కడికి పోరు కార్పొరేటు శక్తులు వచ్చి రైతుల పంటలను తృణమో,పణమో ఇచ్చి కొనుగోలు చేస్తారని విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదాలను ఊహించి రైతులు ఆందోళనలు చేస్తున్నారు
రైతులు పండించిన పంటలకు ధరలు నిర్ణియించే అవకాశాలు కార్పొరేటుశక్తులకు ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతారనే ఆందోళనలతోనే ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుచట్టాన్ని వెనక్కు తీసుకునేంతవరకు రైతులు ఆందోళన విరరమించే ప్రసక్తే లేదని ఇప్పటికే రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు. రైతుచట్టంలో కనీస మద్దతు ధర అన్న అంశాన్ని చేర్చకపోవడం పట్ల కెటిఆర్ అభ్యంతరం తెలిపారు.

ఈ చట్టం రైతులకు నష్టం చేయడంతో పాటుగా దేశంలోని పేద,మధ్యతరగతిప్రజల జీవన విధానాలను కూడా దెబ్బతీస్తుందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేటు శక్తులు రైతుల పంటలను కొనడంతో పాటుగా నిత్యావసర ఆహారవస్తువుల ధరలను కూడా పెంచడంతో పేదల బతకులు ఛిద్రమవుతాయని కెటిఆర్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రరైతు చట్టం పేదప్రజలను చావుదెబ్బకొట్టుతుందన్నారు. ఇప్పటికే నిత్యావసరవస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరవస్తువుల ధరలను నియంత్రించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా సర్దుబాటు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన నల్లచట్టాలు కార్పొరేటు శక్తులకు లాభసాటిగా, దేశప్రజల నడ్డీవిరిచే విధంగా ఉన్నాయన్నారు. కాక్రొరేట్‌శక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువధర చెల్లించి మోసం చేసే అవకాశాలుకూడా ఉన్నయన్నారు. రైతులదగ్గర నుంచి కార్పొరేటు శక్తులు ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి ఆ నిలువలను కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టి ఆహార కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రమాదం ఉందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాటలతో కాదు స్పష్టమైన ఆదేశాలతో కేంద్రం రైతు బిల్లుపై సమాధానాలు చెప్పాలి.
నల్లచట్టాలను కేంద్రం ఉపసంహరించేంతవరకు ఆందోళనలు
కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలు, నల్లచట్టాలకు వ్యతిరేకంగా ధీర్ఘకాలిక ఉద్యమాలు నిర్వహించనున్నట్లు కెటిఆర్ హెచ్చరించారు. ఈ మేరకు టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్,పార్టీ ముఖ్యనాయకులతో చర్చించి ఉద్యమ స్వరూపాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. హస్తినాలో ఆందోళన చేస్తున్న రైతులు ఒంటరివారు కాదు, వారి వెంట తెలంగాణ రైతాంగం ఉందని కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఉద్యమాలను ప్రారంభించి కేంద్రం చెవులు వంచుతామన్నారు. కే్ంరప్రభుత్వం కార్పొరేటు శక్తులకు సాగిల పడుతున్న విధానాలను ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు ఆందోళనలో ఉంటే టిఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కేంద్రాన్ని ఆయన హెచ్చరించారు. తక్షణం నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పోరాటాలు కొత్తకావు
తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్తకావు, ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ సాధించుకున్న చరిత్ర తెలంగాణకు ఉందని కెటిఆర్ చెప్పారు. ఇదే జాతీయ రదారిపైనా తెలంగాణ కోసం వంటలు వార్పులు చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు ఉంది. ఇప్పుడు రైతులకోసం తిరిగి పోరాటాల బాట పట్టేందుకు టిఆర్‌ఎస్ సిద్ధమైందన్నారు. తెలంగాణ ప్రతి పల్లెలో, ప్రతిగల్లిలో ఉద్యామాలు నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రూ. రాష్ట్ర అర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులకోసం డిసెంబర్ 27 నుంచి రైతుబంధు నిధులను సిఎం కెసిఆర్ విడుదల చేయనున్నారని ప్రకటించారు.

Bharat Bandh Success in TS against Farm bills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News