Friday, April 26, 2024

ఆందోళన చెందాల్సినవసరం లేదు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అశించిన ఫలితాలు రాకున్నా మేము సిద్ధాంతాల్ని వీడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు.శుక్రవారం వెలువడిన జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి గల కారణాలను మా నాయకులంతా కలిసి సమీక్ష చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జానారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీని బలహీన పరచాలనే కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పిసిసి ఎవరన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందన్నారు.పార్టీని ఎలా బతికించాలన్నదానిపై మాత్రమే చర్చించామని ఆయన తెలిపారు. కాగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లను మాత్రమే గెలుచుకొని నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడపై పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.

Bhatti Vikramarka Reacts on GHMC Results 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News