Tuesday, April 30, 2024

అన్నాచెల్లెళ్ల అనుబంధమే హైలెట్‌గా…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అలాగే రక్షా బంధన్ సందర్భంగా, చిరు కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రక్షా బంధన్ సందర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ కట్టి చెల్లెళ్లందరీ రక్షాబంధం… అభిమానులందరి ఆత్మ బంధం… మన అందరి అన్నయ్య జన్మదినం.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య… అంటూ ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ అన్నా చెల్లెలుగా ఆకట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో అభిమానులను అలరిస్తుంది. ఈ పవిత్రమైన రోజున మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి నటించడమనేది నా కల. ఈ అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎదురువుతుందా! అని ఎదురుచూడలేకపోతున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ తన ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేస్తూ కీర్తి సురేశ్ వీడియోను విడుదల చేసింది. చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో.. అనీల్ సుంకర ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ అసోషియేషన్ ‘భోళా శంకర్’ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

‘Bhola Shanker’ title poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News