Monday, April 29, 2024

కాటేదాన్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at plastic company in Katedan

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ లోని మైలార్ దేవుపల్లి డివిజన్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ గోదాముకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్‌ఇంజిన్లతో సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fire breaks out at plastic company in Katedan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News