Friday, May 10, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెడతా

- Advertisement -
- Advertisement -

Biden emotional speech at victory rally

 

అమెరికా కోసం అహర్నిశలు కృషి చేస్తా
దేశాభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి సాగుతా
నా దృష్టిలో రెడ్‌స్టేట్స్, బ్లూ స్టేట్స్ లేవు… ఉన్నది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికానే
విజయోత్సవ సభలో బైడెన్ ఉద్వేగ ప్రసంగం

విల్మింగ్టన్: అమెరికా ప్రజలు తమ భవిష్యత్తుకోసం ఓటు వేశారని, వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహారిస్ అద్భుతమైన నాయకురాలని కొనియాడా రు. తమ గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణించారు. శనివారం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్ తొలిసా రి తన సొంత రాష్ట్రమైన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఏర్పాటు చేసిన డెమోక్రాట్ల విజయోత్సవ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్ బైడెన్ సహా ఇతర కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా బైడెన్ ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిన ట్రంప్ తనకేమీ శత్రువు కాదన్నారు. అమెరికా అభివృద్ధికోసం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

కరోనా నియంత్రణ కు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికోసం సోమవారం ఒక ప్రత్యేక కార్యదళాన్ని పకటిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమెరికాలోని ప్రతికుటుంబం ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పని చేస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి సాగుతామన్నారు. తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధికోసమేనని బలం గా విశ్వసిస్తున్నామన్నారు. అంతా కలిసిసాగితే అమెరిక న్లు ఏదైనా సాధించగలరన్నారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య తేడా చూపబోనని హామీ ఇచ్చారు. తన దృష్టిలో రెడ్ స్టేట్స్, బ్లూస్టేట్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీలేవని, ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఉందని అన్నారు. తనకు మద్దతు గా నిలిచిన ఆఫ్రికన్ అమెరికన్లకు, మైనారిటీలకు కూడా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది మహిళాలోకం విజయం
కమలా హారిస్
తన గెలుపుడమహిళా లోకం సాధించిన విజయం గా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ అభివర్ణించారు. ‘అమెరికా ఉపాధ్యక్షురాలి గా ఎన్నికైన తొలి మహిళను కావచ్చు కానీ చివరి మహిళను కాదు’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించా రు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి చిన్నారి ఈ దేశాన్ని ఒక అవకాశాల కేంద్రంగా భావిస్తోంది. అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారన్నారు.ఈ సందర్భంగా తనతల్లి శ్యామలా గోపాలన్ అమెరికా వచ్చి కన్న కలలను కమల గుర్తు చేసుకున్నారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించే శక్తి ప్రజల్లో ఉందం టూ కమల తన మద్దతుదారులను ఉత్సాహపరిచారు.

అమెరికా చరిత్రలో కొత్త రోజులు ఉండబోతున్నాయని నిర్ణయించారని తన గెలుపును ప్రస్తావి స్తూ అన్నారు. గత నాలుగేళ్లుగా సమానత్వం, న్యాయం కోసం పోరాడారు. దాని ఆధారంగానే ఐక్యత, ఆశావాదం, విజ్ఞానం, శాస్త్రవిజ్ఞానాన్ని ఎన్నుకున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బైడెన్ గాయాలను మాన్పే వ్యక్తి. ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకు ఒక అర్థాన్ని ఇచ్చింది. ఒక అర్థవంతమైన దేశంగా తిరిగి నిలబడడానికి మనకు అది తోడ్పడుతుంది. అమెరికాకు మీరు ఒక కొత్త రోజును అందించారు’ అంటూ బైడెన్‌ను సభకు పరిచయం చేస్తూ కమలా హారిస్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News