Monday, April 29, 2024

ఆ కొండ చిలువ పొడవు 17 అడుగులు!

- Advertisement -
- Advertisement -

కొండలు, కోనల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా భారీ అనకొండ ఎదురైతే ఏం చేస్తారు? ఫ్లోరిడాకు చెందిన మైక్ ఎల్ఫెన్ బీన్ బృందానికి కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఫ్లోరిడాలోని బిగ్ సైప్రస్ నేషనల్ ప్రిజర్వ్ ప్రాంతంలో ఎల్ఫెన్ బీన్, అతని కుమారుడు 17 ఏళ్ల కోల్, మరో ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ కొండ కింద ఏదో కదులుతున్నట్లు కనిపించిందట.

దగ్గరికి వెళ్ళి చూస్తే, ఓ కొండ చిలువ తోక అది. దాన్ని బట్టి బయటకు లాగుతుంటే, ద్రౌపదీ వస్త్రాపహరణంలాగ ఎంతకీ పాము బయటకు రావట్లేదు. 17 అడుగులు లాగాక గానీ కొండ చిలువ తల బయటకు రాలేదట. దాన్ని పట్టుకోవడం చాలా కష్టమైందని, చాలాసేపు పెనుగులాడిందనీ ఎల్ఫెన్ బీన్ చెప్పాడు. ఈ కొండ చిలువ పొడవు 17.2 అడుగులు, బరువు 198 పౌండ్లు ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News