Sunday, May 12, 2024

ఒకే ఒక్కడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Bihar CM Nitish Kumar praises KCR

అద్భుత పథకాలతో దేశానికే ఆదర్శం : నితీశ్ ప్రశంసలు

మన తెలంగాణ/హైదరాబాద్: అనతి కాలంలోనే తెలంగాణను దేశంలోనే అగ్రపథంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని బీహార్ సిఎం నితీశ్‌కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన ఆయన దేశ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప వ్యక్తి కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడడమే కాదు… సాధించిన రాష్ట్రా న్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే తెలంగాణ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశారన్నారు. ఇదికెసిఆర్‌కు న్న విజన్… పాలనకునిదర్శనమ న్నారు. కెసిఆర్ బీహార్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో నితీశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కెసిఆర్ పాలనను అమితంగా మెచ్చుకుంటూ.. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. కేవలం పాలనలోనే కాకుండా దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్న వీర సైనికుల కుటుంబాలకు అండగా కూడా నిలబడుతున్నారన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా రావాలన్నారు. గల్వాన్‌లోయఅమరవీరులకు రూ.10 లక్షలు, హైదరాబాద్ దు ర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ.5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బిహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేయడం వారి ఉదారతకు తార్కాణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన కార్యాచరణను దేశంలోనే మరో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదన్నారు. మిషన్ భగీరథ గొప్ప పథకమని నితీశ్ అన్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బిహార్‌లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తామన్నారు. వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఎంత ఎక్కువ ఉం టే అంతగా సమాజం వర్ధిల్లుతుందన్నారు. ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఒక్క కెసిఆర్‌కే సాధ్యమైందన్నా రు. అందుకే తెలంగాణ ప్రజల్లో కెసిఆర్‌కు ఉన్న స్థానం మరే నాయకుడికి లేదన్నారు. అంతలా ఆయనను ఆ రాష్ట్ర ప్రజలు అభిమానిస్తున్నారన్నారు.
రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం మరిచింది
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలకు అందే నిధులకు కేంద్రం కోత పెడుతోందన్నారు. బిహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే మరింత గొప్పగా ఉండేదన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచిందన్నారు. తనకు హైదరాబాద్‌తో మంచి అవినాభావ సంబంధం ఉందని నితీశ్ పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్‌పయ్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్నారు.
అవగాహన లేనివారే తప్పుడు మాటలు
కెసిఆర్ పట్ల అవగాహన లేని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని నితీశ్ అన్నారు. వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కెసిఆర్‌కు సూచించారు. మీరు (-కెసిఆర్) ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగాలన్నారు. బిజెపికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం మీ భాగస్వామ్యం చాలా గొప్పదన్నారు. మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడిందన్నారు. దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదన్నారు. అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరని కెసిఆర్‌పై ప్రశంసలను కురిపించారు

Bihar CM Nitish Kumar praises KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News