Saturday, April 27, 2024

రక్త ప్రసరణ వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

జనరల్ సైన్స్ స్పెషల్-11

Biology question telugu answers

రక్త ప్రసరణ వ్యవస్థ.. మొదటగా అనిలెడా వర్గానికి చెందిన వానపాము, జలగలో ఏర్పడింది.
విలియం హార్వేను రక్తప్రసరణ వ్యవస్థ పితామహుడు అని పేర్కొంటారు.
రక్తం..
రక్తం ఒక కొల్లాయిడల్ పదార్థం.
రక్తం ద్రవరూపంలో ఉండి శరీరంలోని అన్ని భాగాలకు అనుసంధానం చేస్తుంది.
రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అని అంటారు.
రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అని అంటారు.
ఆరోగ్య వంతమైన మానవుడిలో సాధారణంగా 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది.
దీని రుచి కొంచెం ఉప్పగా ఉంటుంది. దీని పీహెచ్ విలువ 7.4
ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆహార పదార్థాలను రక్తం రవాణా చేస్తుంది.
అర్ధ్రోపొడా, మొలస్కా వర్గం జీవులు మినహా అన్ని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది.
జీవుల రక్తంలోని ఎర్ర రక్తకణాలపైన హిమోగ్లోబిన్ ఉంటుంది.
తెలుపు రంగు రక్తం ఉన్న జీవులు.. కీటకాలు (ఆర్ధ్రోపొడా వర్గం)
ఈ జీవుల రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. కనుక రక్తం వర్ణరహితం (తెలుపు)గా ఉంటుంది.
పీతలు, నత్తలు, ఆల్చిప్పల్లో నీలి రంగు రక్తం ఉంటుంది.
ఈ జీవుల రక్తంలో హిమోసయనిన్ అను వర్ణద్రవ్యం ఉంటుంది.
అనిలెడా (పాలికీటా) జీవుల్లో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
ఈ జీవుల్లో క్లోరోక్రువోరిన్స్ అనే శ్వాస వర్ణకం ఉంటుంది.
l రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలు:
1. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ
2. సంవృత లేదా బంధిత రక్తప్రసరణ వ్యవస్థ.
వివృత రక్త ప్రసరణ వ్యవస్థ:
రక్తం రక్తనాళాల్లో కాకుండా స్వేచ్ఛగా శరీరంలోని కోటరాలు లేదా కాలువల్లో ప్రవహిస్తుంది.
ఈ జీవుల్లో రక్త నాళాలు ఉండవు.
ఉదా: ఆర్ధ్రోపొడా, మొలస్కా,ఇకనోడర్మేటా, నిమ్నశ్రేణి కార్డేటా జీవులు.
సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ:
రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది.
ఈ జీవుల్లో రక్తనాళాలు ఉంటాయి.
ఉదా: అనిలెడా, ఆక్టోపస్,.. ఉన్నత స్థాయి కార్డేటా జీవులు, సెఫలోకార్డెటా సకశేరుక జీవులు (చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు)
జలగ లాలాజలంతో వారుడిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రక్తాన్ని పీల్చినప్పుడు గడ్డకట్టకుండా ఉంటుంది.
జలగను చెడురక్తం పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని పిలోబోటమీ అంటారు.
దోమల లాలాజలంలో హిమోలైసిన్ ఉత్పత్తి అవుతుంది.
సీరం..
శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షా నాళికల్లోకి తీసుకున్నప్పుడు రక్తం గడ్డకడుతుంది.
రక్తం గడ్డకట్టిన తర్వాత పైకి కనిపించే పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు.
సీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి. రక్తకణాలు, ప్లాస్మా ప్రొటీన్లు, రక్తం గడ్డకట్టే కారకాలు ఉండవు.
సీరం అధ్యయనాన్ని సీరాలజీ అంటారు.
రక్తం భాగాలు: ప్లాస్మా, రక్తకణాలు
ప్లాస్మా..
రక్తంలోని ద్రవభాగాన్ని ప్లాస్మా అంటారు.
ఆరోగ్య కర వ్యక్తిలో సుమారు 2 నుంచి 3 లీటర్ల ప్లాస్మా ఉంటుంది.
ఇది గడ్డి రంగులో ఉంటుంది.
రక్తంలో ప్లాస్మా 55 శాతం ఉంటుంది.
ప్లాస్మాలో 92 శాతం నీరు, 8 శాతం కర్బన, అకర్బన, ఇతర పదార్థాలు ఉంటాయి.
ప్లాస్మా పీహెచ్ విలువ 7.1
ప్లాస్మాలో అల్బుమిన్, గ్లోబులిన్ అనే ప్రొటీన్లుంటాయి.
ఇవి ఆహార పదార్థాల రవాణాలో పొల్గొంటాయి.
ప్రోత్రాంబిన్, పైబ్రినోజన్ అనే రక్త స్కందన పదార్థాలు ఉంటాయి.
సోడియం, పొటాషియం, అమ్మోనియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడు, ఫాస్ఫేడ్లు, ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి.
కర్బన పదార్థాలైన యూరికామ్లం, విటమిన్లు, హార్మోన్లు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి.
రక్తకణాలు
రక్తంలో రక్తకణాలు 45 శాతం ఉంటాయి.
రక్తకణాల సేకరణకు రక్తానికి 10మి.లీ (0.9శాతం) సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలుపుతారు.
రక్తంలో రక్తకణాలు 45 శాతం ఉంటాయి.
రక్త కణాలు మూడు రకాలు అవి. ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, రక్తఫలకికలు.
ఎర్రరక్త కణాలు (ఆర్‌బీసీ)
ఎర్ర రక్తకణాలను ఆంటోనీవాన్ లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
ఎముక ఎరుపు అస్థిమజ్జలోని నార్మోబ్లాస్ట్ అనే పూర్వ కణాల నుంచి ఎర్ర రక్తకణాలు ఏర్పడుతాయి.
ఎర్రరక్త కణాల పరిపక్వతకు విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లం అవసరం. పరిపక్వం చెందిన ఎర్రరక్తకణాల్లో హిమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది.
కేంద్రకం ఇతర కణాంగాలు ఉండవు. వానపాములో ఎర్రరక్తకణాలు ఉండవు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎరిత్రోపోయిసిస్ అంటారు.
ఎరిత్రోసైసిన్ అంటే ఎర్రరక్తకణాల విచ్చిత్తి. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే అంతరించే ఆర్‌బీసీల సంఖ్య 10×1012

ఆర్‌బీసీల లక్షణాలు:

ఆకారం: బల్లపరుపు లేదా ద్విపుటాకారం క్షీరదాల్లో మాత్రమే ఉంటుంది.
కేంద్రకం: క్షీరదాల ఆర్‌బీసీల్లో కేంద్రకం ఉండదు. కానీ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షుల ఆర్‌బీసీల్లో కేంద్రకం ఉంటుంది.
ఆర్‌బీసీలు పిండదశలో కాలేయం, ప్లీహం నుంచి ఉత్పత్తి అవుతాయి.
కాలేయాన్ని ఎర్రరక్తకణాల క్రాడిల్ అంటారు.
పురుషులలో ఆర్‌బీసీల సంఖ్య.. 4.5 నుంచి 6.5 మిలియన్లు ఉంటుంది.
స్త్రీలలో 3.5 నుంచి 5.5 మిలియన్లు (లేదా) 35 55 లక్షల ఆర్‌బీసీలు ఉంటాయి.
ఆర్‌బీసీల గుంపును రౌలెక్స్ అంటారు. హిమోసైటోమీటర్‌తో ఆర్‌బీసీలను లెక్కిస్తారు.
ఆర్‌బీసీల జీవిత కాలం 120 రోజులు. విటమిన్ సి లోపంతో ఆర్‌బీసీల జీవితకాలం తగ్గుతుంది. ఆర్‌బీసీలు ప్లీహం, కాలేయంలో విచ్చిన్నమవుతాయి.
ఆర్‌బీసీలు విచ్చిన్నం చెందే ప్రక్రియను ఎరిత్రోక్లాసియా అంటారు.
హిమోగ్లోబిన్..
హిమోగ్లోబిన్ ఒక సంయుగ్మ ప్రొటీన్. దీనిలో ఉండే మూలకం ఇనుము. పచ్చని ఆకుకూరలు, కూరగాయల్లో ఐరన్ లభిస్తుంది.
హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము గ్లోబ్యులిన్ ప్రొటీన్ అవసరం.
రక్తంలో హెచ్‌బీని లెక్కించే పద్ధతిని కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు.
హిమోగ్లోబిన్ నిర్మాణంలో హీమ్, గ్లోబ్యులిన్ అనే భాగాలుంటాయి.
హీమ్: హిమోగ్లోబిన్‌లోని ఇనుము భాగాన్ని హీమ్ అంటారు.
ఇది ఫోర్‌పైరిన్ నిర్మాణం మధ్యలో ఉంటుంది.
గ్లోబ్యులిన్ : ఇది ఒక ప్రొటీన్ భాగం. గ్లోబ్యులిన్ నిర్మాణంలో 4 అమైనో ఆమ్ల శృంఖలాలు (2 ఆల్ఫా, 2 బీటా) ఉంటాయి.
హెచ్‌బీతో అధిక చర్యాశీలత ఉన్న వాయువు కార్బన్ మోనాక్సైడ్
ఒక హెచ్‌బీ అణువు 4 ఆక్సిజన్ పరహాణువులను కణాల వద్దకు తీసుకెళ్తుంది.

తెల్ల రక్త కణాలు..

తెల్ల రక్త కణాలను ఫోగోసైట్స్, శరీర రక్షక భటులు, శ్వేత రక్త కణాలు అనికూడా అంటారు.
రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను తెల్ల రక్తకణాలు చంపి దేహాన్ని కాపాడతాయి.
వీటిని శరీర రక్షక భటులు, లేదా రక్తంలోని పారిశుద్ధ కార్మికులు అని అంటారు.
ల్యూకోపాయిసిస్ అంటే తెల్ల రక్తకణాల ఉత్పత్తి.
ల్యూకోలైసిస్ అంటే తెల్ల రక్తకణాల విచ్చిత్తి. ల్యూకోపేనియా అంటే తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా తగ్గటం. ల్యూకేమియా అంటే తెల్ల రక్తకణాల సంఖ్య విపరీతంగా పెరగడం (బ్లడ్ క్యాన్సర్).
శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొనే క్రమంలో చనిపోయిన తెల్ల రక్తకణాలు చీము రూపంలో బయటకు విసర్జితమవుతాయి. డిఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్‌కు తెల్ల రక్తకణాలను ఉపయోగిస్తారు.
తెల్ల రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది.
కాలేయం, ప్లీహం, థైమస్ గ్రంథి (బాల గ్రంథి), దీర్ఘ అస్థిమజ్జ నుంచి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి.
తెల్ల రక్తకణాలు కాలేయం, ప్లీహంలో విచ్ఛిన్నమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News