Home తాజా వార్తలు గ్రాండ్‌గా చరణ్ తల్లి బర్త్‌డే వేడుకలు

గ్రాండ్‌గా చరణ్ తల్లి బర్త్‌డే వేడుకలు

Ram Charan mother

 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని స్వగృహంలో ఘనంగా జరిపారు. చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తల్లి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు… ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్, ఉపాసన ఆమె దీవెనలు అందుకున్నారు. ఇక చరణ్ తల్లికి విలువైన బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక రామ్‌చరణ్ నిర్మాతగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ఓ ప్రక్క తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తాజా షెడ్యూల్ మొదలుకాగా చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

Birthday celebration of Ram Charan mother