Saturday, April 27, 2024

గుజరాత్ లో బిజెపి రికార్డు బ్రేక్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్/సిమ్లా : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పటివరకూ అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ సారి గుజరాత్‌లో 37 ఏండ్ల రికార్డు స్థాయి విజయం సాధించింది. కాగా హిమాచల్‌ప్రదేశలో ఓటమి పాలయింది. బిజెపికి గుజరాత్‌లో విజయంతో మోదం దక్కగా , హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమితో ఖేదం మిగిలింది. ఇక్కడ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రానుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను మోడీ, అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుజరాత్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. ఇందులో అధికార బిజెపి 156 స్థానాలను గెల్చుకుని చారిత్రక విజయం సాధించుకుం ది. రెండు దశల పోలింగ్ తరువాత ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఘన విజయం తరువాత ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కార్యాలయం నుంచి ప్రసంగించారు.

తాను ప్రజల ముందు మోకరిల్లుతున్నానని, వారి ఆశీస్సులు తమకు వెల్లువలా వచ్చిపడ్డాయని తెలిపారు. బిజెపి విజయం వెనుక వంశపారంపర్య పాలన, అవినీతి హయాంలకు వ్యతిరేకంగా గుజరాతీల్లో ఉన్న ఆగ్రహం తిరిగి ద్యోతకం అయిందన్నారు. పరోక్షం గా కాంగ్రెస్‌పై విమర్శలకు దిగారు. బిజెపి లాగా ఇం తకు ముందు ఏ పార్టీ ఇన్నేళ్లుగా ఇంతటి భారీ విజయా ల రికార్డును మూటగట్టుకోలేదన్నారు. అవినీతిపై తాము మోపుతున్న ఉక్కుపాదానికి జనం నుంచి మద్దతు దక్కుతోందని ఈ ఎన్నికలతో స్పష్టం అయిందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి ఓటమిని ఆయన ప్రస్తావించారు.

ఈ పరిణామంతో కుంగిపోకుండా బిజెపి ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు యత్నిస్తూనే ఉంటుందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కూడా తాను కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీకి బిజెపికి ఒక్కశాతమే ఓట్ల తేడా ఉందని, ఇది నా మ మాత్రమే అన్నారు. గుజరాత్‌లో బిజెపి 156, కాం గ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు 4 స్థానాలను గెల్చుకున్నాయి.
గుజరాత్‌లో గిరిజన ఓటర్లు, పాటిదార్ల బలం తిరిగి బిజెపిని మునుపటితో పోలిస్తే అత్యధిక స్థానాల స్థాయికి చేర్చింది. వరుసగా ఏడోసారి విజయానికి దారితీసింది. ఇంతకు ముందటి అసెంబ్లీ ఎన్నికలలో సౌరాష్ట్ర కచ్ ప్రాంతాలు కాంగ్రెస్‌కు కొమ్ముకాసాయి. అయితే ఈసారి ఈ పరిస్థితి తారుమారయింది. ఈ ప్రాంత ఓట ర్లు అత్యధిక స్థాయిలో బిజపి వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలయింది. ఈ ప్రాం తంలోని అగ్రవర్ణాలు, దక్షిణ గుజరాత్‌లోని గిరిజన ఓటర్లు ఈసారి ఎక్కువగా బిజెపికి ఓటేశారు. గుజరాత్‌లో ఎస్‌టిలకు రిజర్వ్ అయిన మొత్తం 27 స్థానాలలో కౌంటింగ్ తొలిదశ నుంచి దాదాపు 24 స్థానాల్లో బిజెపి ఆధిక్యత కన్పించడంతో చివరి వరకూ బిజెపి విజయం బలోపేతంగా సాగుతూ వచ్చింది.

గుజరాత్ ఓటర్లలో గిరిజనుల ఓట్లు 15 శాతం వరకూ ఉన్నాయి. ఈ ఓట్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకే అధికారం చేజిక్కితూ వస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా అశ్విన్ కొత్వాల్, జితూ చౌదరి, మంగళ్ గవిట్ వంటి పలువురు ప్రముఖ గిరిజన నేతలు కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరారు. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా చేసేందుకు బిజెపి నడుంకట్టడం , గిరిజన మహిళకు బిజెపి పట్టం కట్టిందనే ప్రచారాన్ని బిజెపి నేతలు పెద్ద ఎత్తున సాగించడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను పూర్తిగా వెనకకు నెట్టాయి.

ఇక రాహుల్ గాంధీ పూర్తిగా భారత్ జోడో యాత్రకు పరిమితం కావడం, కాంగ్రెస్ మందకొడి ప్రచారం, ఆప్‌ను కట్టడి చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వంటి అంశాలు పార్టీని బాగా కుంగదీసేలా చేశాయి. 1985లో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అప్పటి నేత మాధవ్ సిన్హ్ సోలంకీ నాయకత్వంలో 149 స్థానాలను గెల్చుకోవడం ఓ రికార్డు కాగాఇప్పుడు బిజెపి ఈ రికార్డును తిరగరాసింది.
గుజరాత్ ఎన్నికల్లో ప్రముఖుల గెలుపోటములు
గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా స్థానం నుంచి ఏకంగా 2.13 లక్షలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి కాం గ్రెస్ అభ్యర్థికి కేవలం 21వేల ఓట్లే దక్కాయి. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇసూదాన్ గఢ్వీ కంభాలియా నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి ములు బేరాకు 77 ఓట్లు వచ్చాయి.
పటేల్ వర్గం ప్రాబ ల్యం ఉన్న గుజరాత్‌లో పాటిదార్ల నేత, బిజెపి అభ్యర్థి హార్ధిక్ పటేల్ విరంగమ్ నుంచి విజయం సాధించారు.
వాద్గామ్ నుంచి పోటీ చేసిన దళిత యువనేత, కాంగ్రెస్ అభ్యర్థి జిగ్నేశ్ మేవానీ 4928 ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్థి మణిభాయ్ వాఘేలాను ఓడించారు.

ఓబిసి నేత , బిజెపి అభ్యర్థి అయిన అల్ఫేశ్ ఠాకూర్ గాంధీనగర్ నుం చి గెలిచారు. బిజెపి అభ్యర్థినిగా నిలిచిన రీవాబా జడేజా జామ్‌నగర్ నుంచి గెలిచారు. ఆమె క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి. ఎంతో ఆర్బాటంతో నిలిచిన ఆప్ రాష్ట్ర చీఫ్ గోపాల్ ఇటాలియా కటార్‌గామ్ నుంచి పరాజయం చెందారు. గుజరాత్ ఎన్నికలలో ప్రఖ్యాతమైన రాజ్‌కోట్ నుంచి డిప్యూటీ మేయర్ దర్శిత షా అత్యధిక మెజార్టీతో బిజెపి తరఫున నిల్చిన ఆమె సమీప ప్రత్యర్థిపై లక్ష ఓట్లకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News