Monday, April 29, 2024

బిజెపి నేతలు గొబెల్స్ కు కజిన్ బ్రదర్స్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

BJP Leaders is cousin brother of Goebbels
హైదరాబాద్: బిజెపి వాళ్లు గొబెల్స్‌కు కజిన్ బ్రదర్స్ లాంటి వారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకే అబద్దాన్ని 100 సార్లు చెబితే నమ్ముతారని చందంగా బిజెపి వాళ్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి జవదేకర్ టిఆర్‌ఎస్‌పై ఛార్జ్‌షీట్ అని ప్రకటించి తప్పు చేశారని, ఆయనకు ఇంగీత జ్ఞానం లేదని, ప్రకాశ్ జవదేకర్ ఇప్పటికైనా బుద్దు తెచ్చుకోవాలని సూచించారు. జమ్ము కశ్మీర్‌లో వేర్పాటు వాదులతో పొత్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిందని బిజెపి కాదా? అని ప్రశ్నించారు. ముస్లింలంటేనే బిజెపి నిలువెల్లా విషం నింపుకుందన్నారు.  కాళేశ్వరం నీళ్లిచ్చినందుకా?, కోటిన్నర ఎకరాల మాగాణం చేసినందుకా?, హైదరాబాద్ అతిపెద్ది కంపెనీలను తెచ్చినందుకా?, ఉగ్రవాదులకు హైదరాబాద్‌లో స్థానం లేకుండా చేసినందుకా?, ఆరేళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టనందుకా? టిఆర్ఎస్ పై బిజెపి నేతలు ఛార్జిషీట్ దాఖలు చేశారా? అని అడిగారు. రాజ్యాంగబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమంగా ఇచ్చారా? అని మోడీని ప్రశ్నించారు. అంతర్జాతీయ సంస్థలను అమ్ముతున్న చరిత్ర బిజెపిదేనని, గుజరాత్ భవిష్యత్ కోసమా ఆ సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్ముతున్నదని, 40 కోట్ల పాలసీదారులున్న అతిపెద్ద ఎల్‌ఐసి సంస్థను మోడీ ఎందుకు అమ్ముతున్నారని కెటిఆర్ అడిగారు.

దేశంలో అన్నింటినీ అమ్మేయాలి? పైవేటీకరణ చేయాలన్నదే బిజెపి ఉద్దేశమన్నారు. జిహెచ్‌ఎంసిలో బిజెపి అధికారంలో వస్తే జిహెచ్‌ఎంసిని కూడా ప్రైవేటీకరిస్తారన్నారు. ఐటిఐఆర్‌ను రద్దు చేసినందుకు తెలంగాణ బిజెపిపై చార్జిషీట్ వేయాలన్నారు. లాక్‌డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులు బిజెపిపై చార్జిషీట్ వేయాలని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ దేశ ప్రజలను మోసం చేశారని, జన్‌ధన్ యోజన అన్నారు… ధన్ ధన్ రూ.15 వేలు ఇస్తామన్నారు ఎవరికిచ్చారని మోడీని నిలదీశారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో దేశంలో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా? మోడీ ప్రభుత్వాన్ని కెటిఆర్ సూటిగా అడిగారు. దేశంలోని చిన్నా చితకా ప్రజలంతా కలిసి బిజెపిపై చార్జిషీట్ వేయాలన్నారు. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాన్ని దెబ్బతీసున్నదేవరని మోడీని సూటిగా ప్రశ్నించారు. లక్షల కోట్లు ఎగ్గొటిన విజయ్ మాల్యాలాంటోళ్లను కాపాడినందుకా?, కేంద్రంలో బిసిలకు మంత్రిత్వ శాఖ లేనందుకా?, మోడీ పాలనలో పెట్రోల్ ధరలు పెరిగినందుకు వాహనదారులు బిజెపిపై చార్జిషీట్ వేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News