Monday, May 6, 2024

హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోంది: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

BJP split Muslim and Hindu Votes along with AIMIM: Mamata

కోల్ కతా: హైదరాబాద్ పార్టీ బిజెపికి ‘బి టీమ్’లా వ్యవహరిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయా కాక వేడెక్కుతోంది. దీంతో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బిజెపి కోట్ల రూపాయలు ఇచ్చి, హైదరాబాద్ నుంచి ఓ పార్టీని తీసుకొస్తోందని సిఎం మమత మండిపడ్డారు. ముస్లిం ఓటర్లను చీల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆమె ఫైర్ అయ్యారు. దీనివల్ల హిందూ ఓట్లు బిజెపికి, ముస్లిం ఓట్లు హైదరాబాద్ పార్టీకి పడుతున్నాయి.. మొన్నటి బీహార్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని మమత బెనర్జీ పేర్కొన్నారు. దీదీ చేసిన ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. ఓటర్ ఎవరి జాగీరు కాదని, జీ హుజూర్ అనేవారి మాటలే మమత వింటుందన్నారు. ఇప్పటివరకూ నన్ను కొనే వాళ్లు పుట్టలేదని.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఇలా దిగజారి మాట్లాడకూడదని మండిపడ్డారు. ఇప్పటివరకూ మీ చెప్పుచేతల్లో ఉండేవారినే చూశారని, ముస్లింల కోసం మాట్లాడే నేతల్ని చూడలేదని ఓవైసి కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

BJP split Muslim and Hindu Votes along with AIMIM: Mamata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News