Monday, May 6, 2024

కేరళలో 115 స్థానాల్లో బిజెపి పోటీ

- Advertisement -
- Advertisement -

bjp to contest from 115 seats in kerala

న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారం ప్రకటించింది. 140 స్థానాల్లో 115 స్థానాల నుండి పార్టీ పోటీ చేయనున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగిలిన 25 సీట్లను మిత్రపార్టీలు పోటీ చేస్తాయన్నారు. ఇందులో మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా, ఇప్పటికే కేరళ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి.

bjp to contest from 115 seats in kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News