Monday, April 29, 2024

పేదల సాధికారత కోసం బీజేపీ కృషి : మోడీ

- Advertisement -
- Advertisement -

BJP working for poor empowerment: PM Modi

న్యూఢిల్లీ : పేదలు సాధికారులైతే పేదరికంపై పోరాడే ధైర్యం వారికి వస్తుందని, ఓ నిజాయితీగల ప్రభుత్వ కృషికి సాధికారులైన పేదల కృషి తోడైతే , పేదరికం మటుమాయం అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5.21 లక్షల ఇళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. పేదరిక నిర్మూలన గురించి కొన్ని రాజకీయ పార్టీలు చాలా నినాదాలు ఇచ్చాయని, అయితే పేదలను సాధికారులుగా చేయడానికి చేయవలసినంత కృషి చేయలేదని మోడీ చెప్పారు. పేదల సాధికారత కోసం బీజెపి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, గతంలో పనిచేసిన బీజేపీయేతర ప్రభుత్వాలు పేదల కోసం సరిపడినన్ని ఇళ్లను నిర్మించలేదన్నారు.

తాను ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి పూర్వం ఉన్న ప్రభుత్వం పేదల కోసం కేవలం కొన్ని లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించిందన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం 2.5 కోట్ల ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. వీటిలో రెండు కోట్ల ఇళ్లను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఈ పనుల వేగం తగ్గలేదన్నారు. చాలామంది మహిళలకు ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పించినట్టు తెలిపారు. దీనివల్ల ఆయా కుటుంబాల్లో ఇతర ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం మరింత పటిష్టమైందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇది కేస్ స్టడీకి సంబంధించిన విషయమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News