Monday, May 6, 2024

డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ బిజెపి లీడర్

- Advertisement -
- Advertisement -

BJP youth leader arrested with cocaine in Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో బిజెపి లీడర్ పమేలా గోస్వామి డ్రగ్స్ సరపరా చేస్తూ పట్టపడ్డారు. భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) రాష్ట్ర కార్యదర్శి గోస్వామి తన స్నేహితుడు ప్రబీర్ కుమార్ డే తో కలిసి కొకైన్ సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్, కారులోని ఇతర భాగాలలో సుమారు 100 గ్రాముల కొకైన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  ఆమె కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని, నిన్న వేరే వాళ్లకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే తనను ఇరికించారని పమేలా తెలిపారు. ఎనిమిది వాహనాల్లోని పోలీసుల బృందం ఆమె కారును చుట్టుముట్టి పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే వాహనం లోపల ఉన్న బిజెపి యువజన నాయకుడి సెక్యూరిటీ గార్డును కూడా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

BJP youth leader arrested with cocaine in Kolkata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News