Wednesday, May 1, 2024

బోనమెత్తిన కందనూలు ఆడపడుచులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఆడపడుచుల బోనాలతో కందనూలు మురిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సం బంరం వెళ్లివిరిసింది. ఈదమ్మ, పోచమ్మలకు బోనం సమర్పించి భక్తజనం తరించిపోయారు. బోనం సమర్పించిన తమను చల్లగా చూడాలని, ఎలాంటి మహమ్మారి తమకు తగలకుండా కా పాడాలని అమ్మవారిని వేడుకున్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈదమ్మ గుడి దగ్గర తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తమ తమ ఇండ్లలో నుంచి బోనాలను ఎత్తుకుని సంతోషంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చిన్నారులు సైతం బోనాలు ఎత్తుకుని ఆ కర్షణగా నిలిచారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, యువతుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. తెల్లవారుజామున నుంచే ప్రారంభమైన భక్తుల రా క సాయంత్రానికి ఊపందుకుంది. తీరొక్కపూలతో, విభిన్న అలంకరణ, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయం అలంకరించబడింది. శక్తి స్వరూపిణిగా కొలిచే అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఆలయ కమిటీ, మున్సిపాలిటీ అధికారులు సకల సౌకర్యాలను సమకూర్చారు.

అమ్మవారి ఆలయం ముందు ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. బోనమెత్తిన ఆడపడుచులు తల్లికి మొక్కులు చెల్లించి మనసారా దీవించమని వేడుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సతీమణి, ఎంజెఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమున రాణి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తిమ్మాజిపేట పాండు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News