Saturday, May 11, 2024

బ్యాటర్లపై బిసిసిఐ బౌన్సర్!

- Advertisement -
- Advertisement -

టీ20 క్రికెట్ పేరు చెబితే సూర్యకుమార్, కోహ్లీ, మాక్స్ వెల్ వంటి బ్యాటర్లు గుర్తుకొస్తారు. అయితే ఇలాంటి బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బీసిసిఐ ఒక కొత్త రూల్ ని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇకపై టీ20 బౌలర్లు ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు వేయవచ్చు. ఇదే ఆ కొత్త రూల్. దీనివల్ల డెత్ ఓవర్లలో పరుగుల వరద పారించాలనుకునే బ్యాటర్లకు ఇబ్బందే. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఉన్నా, టి20లలో మాత్రం ఒకే బౌన్సర్ కే అనుమతి ఉంది. కొత్త రూల్ వల్ల చివరి ఓవర్లో ఫాస్ట్ బౌలర్లు యార్కర్లతోపాటు బౌన్సర్లనూ సంధించి, బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News