Saturday, May 11, 2024

పెళ్లి…. వధువు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

Bride dead with heart attack in Marriage

బెంగళూరు: పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. తండ్రి అబ్దుల్ కరీం అనే వ్యక్తి బీరప్ప గద్దే జమాత్ అధ్యక్షుడుగా ఉన్నాడు. అబ్దుల్ తన కూతురు, కుమారుడు పెళ్లి ఒకే వేధికపై అంగరంగా వైభవంగా చేశాడు. లైలా ఆఫియా అనే యువతి, ముబారక్ అనే యువకుడిని ఫిబ్రవరి 28న పెళ్లి చేసుకుంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వరుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి లైలా ఇంటికి వెళ్లారు. అందరూ ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో పెండ్లి కూతురు లైలా ఛాతిలో నొప్పిగా ఉందని ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. శవ పరీక్షలో ఆమె గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News