Friday, May 3, 2024

భారత్‌కు తెచ్చిన నీరవ్ మోడీ ఆభరణాలు

- Advertisement -
- Advertisement -

Brought to India Nirav Modi Jewellery

వజ్రాలు, నగల విలువ రూ.1350 కోట్లు : ఇడి

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో హాంకాంగ్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి చెందిన రూ.1350 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలను తిరిగి తెచ్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) వెల్లడించింది. ఈ ఆభరణాలను హాంకాంగ్ లాజిస్టిక్స్ సంస్థ గిడ్డంగిలో ఉంచా రు. వజ్రాలు, రత్నాలను మాజీ ఇడి డైరెక్టర్ కాలంలో గుర్తించగా, అప్ప టి నుండి వాటిని తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి. పిఎన్‌బి స్కామ్ నిందితుడు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ ఈ కుంభకోణానికి సంబంధించిన చాలా డబ్బు ను వివిధ దేశాలకు పంపారని ఇడి అధికారులు తెలిపారు.

బుధవారం భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన 108 విలువైన లోహాల్లో పాలిష్ చేసిన డైమండ్ పూసలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాల మొత్తం బరువు 2340 కిలోలు ఉంటుంది. బుధవారం వీటిని ముంబైకి తీసుకొచ్చారు. ఈ ఆభరణాలను మొదట భారతదేశం నుండి దుబా య్, తరువాత దుబాయ్ నుంచి 2018 ప్రారంభంలో హాంకాంగ్‌కు పంపారు. ఈ విలువైన ఆభరణాల గురించి సమాచారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు జూలై 2018లో ఇంటెలిజెన్స్ అందించింది. ఆ తర్వా త అప్పటి డైరెక్టర్ కల్నల్ సింగ్ దీనికి సంబంధించి హాంకాంగ్ అధికారులతో మాట్లాడారు.

దీంతో వాటిని హాంకాంగ్‌లోనే సీలు చేశారు. కల్నల్ సింగ్ ఇడి డైరెక్టర్ పదవి నుండి పద వీ విరమణ చేసిన తరువాత కూడా వీటిని విదేశాల నుండి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. చివరకు అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన తరువాత ఆభరణాలను తిరిగి పొందడంలో ఇడి విజయవంతమైంది. వీటి లో 32 ఆభరణాలు నీరవ్ మోడీ కంపెనీలకు చెందినవని ఇడి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగిలినవి మెహుల్ చోక్సీ నియంత్రణలో ఉన్న సంస్థలకు చెందినవి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News