Thursday, May 9, 2024

బస్సులు అద్దెకు కావాలి!

- Advertisement -
- Advertisement -

ప్రకటన విడుదల చేసిన ఆర్టీసి

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం టిఎస్ ఆర్టీసిపై పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణికులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్‌లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో స్పందించిన టిఎస్ ఆర్టీసి అర్జెంట్‌గా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ టు ఘట్కేసర్ రూట్ బస్సులైతే పీక్ అవర్లో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రూట్లో మెట్రో బస్సులు అసలు నడువవు. పైగా ఈ రూట్లో విద్యార్థుల రద్దీ ఎక్కువ.

ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని టిఎస్ఆర్టీసి సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov లేదా 9100998230 నెంబర్‌లలో సంప్రదించాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టిఎస్ ఆర్టీసి బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News