Monday, May 6, 2024

ఈటల బావమరిదిపై చర్య తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

వాట్సాప్ చాట్‌లో దళితులను కించపరుస్తూ వ్యాఖ్యానించిన కొండవీటి మధుసూదన్‌రెడ్డిపై డిజిపికి ఫిర్యాదు చేసిన టిఎస్‌జిసిసి చైర్మన్ ధారావత్ మోహన్ గాంధీ

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ బావ మరిది కొండవీటి ముధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టిఎస్‌జిసిసి చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ గురువారం డిజిపికి ఫిర్యాదు చేశారు. ఈటెల బావమరిది కొండవీటి ముధుసూదన్ రెడ్డి దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈటల పౌల్ట్రీ పార్టనర్‌తో ముధుసూదన్ రెడ్డి చేసిన ఫోన్ వాట్సప్ చాట్‌లో దళితులను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను ఖండించడంతో పాటు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపికి ఫిర్యాదు చేశామని టిఎస్‌జిసిసి చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ మీడియాకు వివరించారు.ఈ సందర్భంగా ధారవత్ మోహన్ గాంధీ మాట్లాడుతూ దళితులను అసభ్యంగా తిడుతూ మెసేజ్ చేసిన ముధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మధుసూదన్ రెడ్డి దళితులను కించ పర్చే విధంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల వివాదంపై ఈటల రాజేందర్, ఆయన బామ్మర్ది బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే దళిత వాడలకు ఓటు అడగడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈటల కుటుంబంపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం అమలుతో ఒడిపోతామని భయంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మోహన్ గాంధీ మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఈ ఎన్నికలలో దళితుల ఆగ్రహావేశాలు ఓటు రూపంలో చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Case filed against Kondaveeti Madhusudhan reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News