Monday, April 29, 2024

క్యాచ్ మీ…

- Advertisement -
- Advertisement -

Catch me song release from Khiladi

 

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. క్యాచ్ మీ… అంటూ సాగే ఈ పాటను రవితేజ, డింపుల్ హయాతిల మీద చిత్రీకరించారు. ఈ పాటలో డింపుల్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్ విందు ఇచ్చింది డింపుల్. శ్రీమణి సాహిత్యం, నేహా బాషిన్, జస్ప్రిత్ జాస్జ్ గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు. ఖిలాడీ సినిమా ఈనెల 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకురానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News