Sunday, April 28, 2024

కరోనా సోకిన వ్యక్తి నుంచి ఫోన్ ను దొంగలించి… దొంగకు కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Cell theft at corona patient by thief

 

భువనేశ్వర్: ఓ దొంగ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన వ్యక్తి దగ్గర సెల్‌ఫోన్ దొంగతనం చేసిన సంఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నడి రాత్రి పప్పు బుర్మాన్ అనే దొంగ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు వచ్చాడు. కరోనా రోగి నిద్రిస్తున్న సమయంలో అతడి ఫోన్‌ను దొంగలించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మర్నాడు తన ఫోన్ ఎవరో ఎత్తుకెళ్లారని కరోనా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆస్పత్రిలో సిసి కెమెరాను గమనించగా బుర్మాన్ దొంగతనం చేసినట్టు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే ఫోన్ ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో పోలీసులకు అర్థం కాలేదు. ఆ దొంగను క్వారంటైన్‌కు తరలించి కరోనా టెస్టులు చేస్తున్నారు. బుర్మాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దొంగకు కరోనా అంటే భయంలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కరోనా రోగులున్న ఆస్పత్రికి వెళ్లాలంటేనే వెన్నులో వణుకుపుడుతుందని, అలాంటిది కరోనా రోగి వద్ద సెల్ ఫోన్ ను దొంగలించడం దొంగ దైర్యానికి హ్యాట్సాప్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News