Monday, April 29, 2024

కేంద్రం బియ్యం డ్రామా

- Advertisement -
- Advertisement -

Central govt for hand-picking on grain purchases

నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్

అంతర్జాతీయ మార్కెట్‌కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక మాదిరిగా ద్వంద్వ వైఖరి

మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్‌కు బియ్యం ఎగుమతి చేయక…దేశీయంగా కొనుగోళ్లను ప్రోత్సహించక పోవటంతో దేశాన్ని ధాన్యం నిల్వల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. గత మూడేళ్లుగా భారత ఆహారసంస్థ గిడ్డంగుల్లో లక్షలాది టన్నుల కొద్ది బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని రాష్ట్రాలపైకి నెట్టివేస్తూ వరి పండించిన రైతులను నట్టేట ముంచుతోంది. ఆహారోత్పత్తుల ఎగుమతుల విషయంలో ప్రత్యేకించి బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్రప్రభుత్వం మొద్దనిద్ర పోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ జనాభా ఆహర అవసరాలకు మూడేళ్లు సరిపడేంతగా గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని , రైతులు పండిస్తున్న ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వమే తన నిస్సహాయతను బయటపెట్టుకుంటూ అందుకు ధాన్యం పండించిన రైతులను బలిపశువులుగా చేస్తోంది. దేశ ఆహార అవసరాలకు రైతులనుంచి ధాన్యాన్ని లెవీరూపంలో ముక్కుపిండి వసూలు చేస్తువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడు సిఎంఆర్ విధానం అమలు చేస్తోంది.

తనకు ధాన్యం అవసరమైనపు ఒకలాగా, అవసరం లేనపుడు మరోలా ద్వంద వైఖరితో ప్రజల్లో పలుచనవుతోంది. ఆహారోత్పత్తుల ఎగుమతుల విధానాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం ఇప్పడు ఎఫ్‌సిఐ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుయినందుకు మాత్రం తన బాధ్యత లేదన్న లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది. అధికార వర్గాల సమాచారం మేరకు దేశంలోని ఎఫ్‌సిఐ గిడ్డంగుల్లో వెయ్యి లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. నిర్వహణ లోపాలతో మూడేళ్లుగా బియ్యం నిల్వలు పందికొక్కుల పాలవుతున్నా కేంద్ర ప్రభుత్వం బియ్యం నిల్వలవైపు కన్నెత్తి చూడటం లేదు. దేశంలో ధాన్యం పండిచే రాష్ట్రాలు వేళ్లమీద లెక్కపెట్టేంతగానే ఉన్నాయి .అందులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వానాకాలం , యాసంగిలో కలిపి ఏటా సగటున కోటి ఎరకాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం ఏటా 2.5కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిచేస్తున్న తెలంగాణ రైతులు వరిసాగులో దేశానికి ఆదర్శంగా నిలిచారు.

పంజాబ్ , ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కంటే ఎంతో దిగువన ఉన్నాయి పుష్కలంగా సాగునీటిని అందుబాటులోకి తేవటంతోపాటు , రైతుబంధు , రైతుబీమా , పంట రుణాల మాఫీ , తదితర పధకాలతో రైతులకూ ఊరటినిస్తూ ముఖ్యమంత్రి కెసిర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిచంటం ద్వారానే ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా నిలించింది. అయితే కేంద్రం నుంచి పంటల సాగులో రైతులకు పెద్దగా ప్రోత్సాహం లేకపోగా , కనీసం పండించిన ధాన్యం కొనుగోలులో కూడా రైతులకు అండగా నిలవటం లేదన్న విమర్శలు మూటగట్టుకొంటోంది.

ఎగుమతిలేక ఏటా లక్ష కోట్లు నష్టం:

బియ్యం ఎగుమతుల్లో కేంద్రం మొద్దు నిద్ర ఫలితంగా ఏటా లక్షల కోట్ల మేరకు ప్రజాధనం వృధాఅవుతోంది. ప్రభుత్వం ధాన్యానికి కనీస మద్దతు ధరలు అమలు చేస్తోంది. క్వింటాలు ధాన్యంకు రూ.1960 చెల్లిస్తున్న ప్రభుత్వం ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు వాటిని మిల్లులకు అప్పగిస్తుంది. సిఎంఆర్ విధానంలో తిరిగి మిల్లుల నుంచి బియ్యం సేకరిస్తుంది. బియ్యాన్ని గిడ్డంగులకు రవాణ చేయటం , అక్కడ వాటిని నెలల తరబడి నిల్వ చేయడం , సిబ్బంది జీత బత్యాలు తదితర అన్ని రకాల వ్యయాలు కలిపితే క్వింటాలుకు రూ.3100కు చేరుకుందని చెబుతున్నారు. కేంద్రం బియ్యం ఎగుమతుల్లో సరైన విధానం పాటించకపోవటంతో ధాన్యం సేకరణ ద్వారా రూ.450, బియ్యం మిల్లింగ్ ప్రక్రియలో రూ.700నష్టపోవాల్సివస్తోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ ,బియ్యం నిల్వల నిర్వహణ తదితర వాటికోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.3లక్షల కోట్లుకు పైగా కేటాయిస్తోంది.

అయితే విధాన పరమైన లోపాల కారణంగా రూ.లక్ష కోట్లు వృధాగా నష్టపోతున్నట్టు సమాచారం ఇటు ఆరుగాలం శ్రమించి ధాన్యం పండించిన రైతుకు ఫలితం దక్కకుండా, అటు వినియోగదారులకు సరసమైన ధరల్లో బియ్యం లభించక , సరైన ఎగుమతి విధానాలు పాటించక కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో ఏటా లక్షకోట్ల ప్రజాధనం వృధాగా కరిగిపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం ఎగుమతి విధానాలు సరిదిద్దాలని, బియ్యం ఎగుమతుల పట్ల ్రప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నా మిల్లర్లు, వ్యాపారవర్గాలు కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు కేంద్రం అనుసరిస్తున్న ధాన్యం సేకరణ, బియ్యం ఎగుమతులు , గిడ్డంగుల్లో భారీగా పేరుకుపోయిన బియ్యం నిల్వలు , కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదించినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News