Tuesday, April 30, 2024

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

coronavirus

 

హైదరాబాద్ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించారు. విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజరల్ను ధర్మల్ స్కానర్లతో పరీక్షిస్తున్నారు. స్క్రీనింగ్ జరుగుతున్న ఎయిర్‌పోర్టులను సెంట్రల్ హెల్త్ టీమ్‌లు ఆదివారం సందర్శించనున్నాయి. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన టీమ్ ఆదివారం హైదరాబాద్‌కు రానుంది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న ప్యాసింజర్ల స్క్రీనింగ్, క్యారంటైన్ సెంటర్‌ను ఈ టీమ్ పరిశీలించనుంది. అలాగే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న చర్యలపై సమీక్షించే అవకాశముంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో కరోసా, ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు హెల్త్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు.

 

Central Health Ministry alerted to coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News