Monday, May 6, 2024

రేపటి నుండి రోడ్డు భద్రతా వారోత్సవాలు

- Advertisement -
- Advertisement -

Road safety

 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వరకు నిర్వహిస్తున్నట్లు టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతాలో ప్రతిభ కనబర్చిన డ్రైవర్‌లకు రాష్ట్ర స్థాయి, జోనల్‌స్థాయి, రీజనల్‌స్థాయి, డిపో స్థాయిలో ప్రధమ, ద్వితీయ,తృతీయ నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు అలాగే రాష్ట్రంలోని డిపోల పరిధిలో క్రీయాశీలమైన భూమిక వహించే డిపో మేనేజర్‌లు, సూపర్ వైజర్‌లను కూడా ఈ సారి నగదు ప్రోత్సహాకాలను అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నగదు ప్రొత్సహాకంలో తొలి స్థానం పొందిన డ్రైవర్‌కు రూ.12వేలు నగదు బహుమతి ఇవ్వాలని, జోనల్ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.4,500లను, రీజనల్ స్థాయిలో రూ.3,250లను, డిపోస్థాయిలో రూ.2వేలు ప్రథమ బహుమతి కింద నగదు ప్రొత్సహాకంగా ఇస్తామన్నారు.

ఇదిలా ఉండగా డిపో మేనేజర్‌లు, సూపర్‌వైజర్‌ల పరిధిలో ప్రమాదా రహిత ప్రతిభ ఖరారు చేయడానికి టిఎస్‌ఆర్‌టిసిలోని బస్సు డిపోలను మూడు కేటగిరిలుగా విభజించామన్నారు. ఈ మేరకు కేటగిరి1లో ప్రథమ బహుమతి రూ.33వేలు, ద్వితీయ బహుతి రూ.21,400లు, కేటగిరి2లో ప్రధమ బహుమతి రూ.26వేలు, ద్వితీయ బహుమతి రూ.17,200లు, కేటగిరి3లో ప్రథమ బహుమతి రూ.18వేలు, ద్వితీయ బహుమతి రూ.12,400లను అందజేస్తామని ఆయన వివరించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు, రవాణా, పోలీసు, న్యాయ, ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా ఆహ్వానించాలని అదేశించారు. అలాగే సూపర్‌వైజర్, డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ సిబ్బంది సిహితం ప్రమాదాల రహితం పై విస్తృతమైన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకొవాలని సూచించారు.

ఈ సమావేశంలో రోడ్డు భద్రత పై సురక్షితమైన డ్రైవింగ్ సంబంధించిన అంశాల పై సూచనలు, సలహాలను అందజేయాలని క్షేత్ర స్థాయి అధికారులను నిర్ధేశించారు. అలాగే రోడ్డు భద్రత పై సంస్థ సిబ్బంది, ప్రయాణికులలో విస్తృతమైన అవగాహన పెంపొందించడానికి బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లుల ద్వారా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిబ్బందికి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు, సురక్షితమైన డ్రైవింగ్ పై శిక్షణ తరగతులు, ప్రతి జోనల్ పరిధిలో ట్రైనింగ్ కాలేజ్ నందు ప్రత్యేక శిక్షణ అందుబాటులోకి తెవాలని సూచించారు. బస్సుల మెయింటెనెన్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ద వహించడం అదేశించారు. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, రీజనల్ స్థాయి, డిపోస్థాయి నుంచి ముగ్గురు చోప్పున ఎంపిక చేసి, నగదు ప్రోత్సహాకాలను అందజేయడంతో పాటు ప్రశంసా పత్రము, జ్ఞాపికను కూడా ఇవ్వ డం జరగుతుందని వెల్లడించారు.

అలాగే 201819 ఆర్ధిక సంవత్సరంలో వివిధ కేటగిరిలల్లో అతి తక్కువ ప్రమాదాల రేటు నమోదు చేసిన డిపో మేనేజర్, సూపర్‌వైజర్‌లను ఎంపిక చేసి నగదు ప్రోత్సహాకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భం గా ప్రతి కేటగిరిలో ప్రథమ, ద్వితీయ బహుమతిలను కూడా ప్రకటించారు. కేటగిరి1లో (121కు మించి ఎక్కువ షెడ్యూళ్లు కలిగిన డిపోలకు ప్రథమ బహుమతిగా రూ.33వేలు, ద్వితీయ బహుమతిగా రూ.21,400లు, కేటగిరి2లో (66 నుండి120 షెడ్యూళ్లు కలిన డిపోలు) ప్రథమ బహుమతి రూ.26వేలు, ద్వితీయ బహుమతి రూ.17,200లు అందజేస్తారు. కేటగిరి3లో(66 నుంచి120 లోపు షెడ్యూళ్లు కలిగి డిపోలు)ప్రథమ బహుమతి రూ.18వేలు, ద్వితీయ బహుమతి రూ.12,400లు చెల్లిస్తారు.

నగదు ప్రోత్సాహకాలు ఇవే..

రాష్ట్ర స్థాయిలో : ప్రథమ స్థానం నిల్చిన వారికి రూ.12వేలు, ద్వితీయ స్థానం నిల్చిన వారికి రూ.10వేలు, తృతీయ స్థానం నిల్చిన వారికి రూ.8వేలు చెల్లిస్తారు.

జోనల్ స్థాయిలో : ప్రథమ బహుమతి రూ.4,500లు, ద్వితీయ రూ. 4,200, తృతీయ బహుమతి రూ.4వేల ప్రోత్సహకాలను అందజేస్తారు.

రీజనల్ స్థాయిలో : ప్రథమ స్థానం రూ.3,250లు, ద్వితీయ స్థానం3,000లు,తృతీయ స్థానం రూ.2,750ల నగదు అందజేస్తారు.

డిపో స్థాయిలో : ప్రథమ స్థానం రూ.2వేలు, ద్వితీయ స్థానం రూ.1,750లు, తృతీయ స్థానం రూ.1,500లు అందజేస్తారు.

Road safety weekends from tomorrow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News