Friday, May 3, 2024

సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Chhetri scored 77th international goal of his career

 

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జత చేసుకున్నాడు. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ సాధించడం ద్వారా ఛెత్రి మరో రికార్డును నెలకొల్పాడు. నేపాల్ మ్యాచ్‌లో అతను తన కెరీర్‌లో 77వ అంతర్జాతీయ గోల్‌ను నమోదు చేశాడు. ఈ క్రమంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. పీలే సాధించిన 77 గోల్స్ రికార్డును ఛెత్రి అందుకున్నాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 తేడాతో విజయం సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News