Saturday, April 27, 2024

చిన్నారుల ఆకలి కేకలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కాంగ్రేస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కొరకు ఆరు గ్యారెంటి స్కీంలు ఎన్నికల వేళ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటి స్కీంలు సంగతి ఎట్లా ఉన్న అవి ఎవరికి అందుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలి తీర్చుకునేందుకు ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైల్వే ట్రాక్ వెంబడి ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ దర్శనం ఇవ్వడం కలచి వేస్తుంది. కాసిపేట మండలంలోని రైల్వే స్టేషన్ పెద్దనపల్లి గ్రామం సమీపంలోని మైక్రో స్టేషన్ ముందు నివాసం ఉండె ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలసి ఆదివారం విద్యుత్తు సబ్‌స్టేషన్ పక్కనే రైల్వే ట్రాక్ కు ఇరు వైపుల ఖాళీ వాటర్ బాటిళ్లు, ప్రయాణికులు రైల్లో నుండి విసిరి వేసిన సిల్వర్ ఫుడ్ కవర్‌లు ఏరుకుంటు దర్శనం ఇచ్చారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అందులో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సబ్సిడిపై గ్యాస్, ఆరోగ్య శ్రీ పెంపు, గరిబోళ్లకు ఇందిరమ్మ పథకం, ఇక మహిళలకు 2500 పథకం ప్రవేశ పెట్టనుంది.

మరి ఇవన్ని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి వర్తిస్తాయా..? అనే సందేహాలు వినవస్తున్నాయి. ఎందరో అభాగ్యులు ఇప్పటికి నిలువ నీడ లేకుండా ఉన్నారు. కన్నవారు ఆదరించక కొందరు, ఆర్థిక స్థోమత లేక కొందరు చెట్ల కింద, బస్‌సెల్టర్లలో నివసిస్తూ, ఎవరైన ఇంత తిండి పెడితే తింటు రోజులు లెక్కిస్తున్నారు. ఇలాంటి ఎంత మందికి ప్రభుత్వాలు సహాకారాలు అందిస్తునాయనే వాదనలు కూడా వినవస్తున్నాయి. కొన్ని స్వఛ్చంద సంఘాలు కూడా ఉన్నప్పటికి వారు కూడా పై లాంటి వారి వైపు చూడడం లేదనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. పైన ప్లాస్టిక్ ఏరుకుంటున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండడం విశేషం, ఆకలి తీర్చుకోవాలంటే ప్లాస్టిక్ ఏరుకోక తప్పదని పిల్లల తల్లి కంట తడి పెట్టడం గమనార్హం. ఇలాంటి వారికి సహాయ సహాకారాలు అందిస్తే, ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలకు విలువ వుంటుందని పలువురు విశ్లేసిస్తున్నారు. పాలకులు, అధికారులు దారిద్ర రేఖకు దిగువ వున్నవారిని ఆదుకోవాలని పలువురు కోరుచున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News