Saturday, April 27, 2024

‘బైరెడ్డి’గా రానున్న చిరు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi role as byreddy

 

మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ని హోమ్ బ్యానర్‌లో రామ్‌చరణ్… – ఎన్వీ ప్రసాద్‌తో కలిసి నిర్మించనున్నారు. ముందుగా ఈ రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు సుజీత్‌కి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకోవడంతో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలోకి ఈ సినిమా వెళ్లింది. చివరగా తమిళ దర్శకుడు మోహన్ రాజాకి తెలుగు ‘లూసిఫర్’ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారని తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త వినిపిస్తోంది. ఈ రీమేక్‌కి ‘బైరెడ్డి’ అనే టైటిల్ పెడుతున్నారట.

ఇందులో హీరోను రెండు పేర్లతో పిలవగా… వాటిలో ఒకటి ‘బైరెడ్డి’ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి రాయలసీమ బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకున్నారని తెలిసింది. చిరు ఇందులో పొలిటీషియన్‌గా, మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాయంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీమేక్ స్పెషలిస్ట్‌గా పిలవబడే మోహన్ రాజా.. తన టీమ్‌తో పాటు మెగాస్టార్ చెప్పిన రచయితలతో కలిసి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న ‘ఆచార్య’ పూర్తయిన తర్వాత ఈ రీమేక్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News