Monday, May 6, 2024

చోక్సీ అరెస్ట్‌కు ముందు హైడ్రామా..

- Advertisement -
- Advertisement -

చోక్సీ అరెస్ట్‌కు ముందు హైడ్రామా
డొమినికా పోలీసుల్ని చూసి పరుగు
కొన్ని పత్రాలు సముద్రంలో విసిరివేత: ప్రత్యక్ష సాక్షి

రోసియా: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్లు మోసం చేసిన కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు హైడ్రామా జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రోసియా నగరంలో పట్టుబడటానికి ముందు ఆ దేశ సిఐడి పోలీసుల్ని చూసి చోక్సీ పరుగు లంకించుకున్నారని ప్రత్యక్ష సాక్షి హ్యారీ బ్యారన్ తెలిపారు. ఆ సమయంలో తన చేతిలో ఉన్న కొన్ని పత్రాలను కరేబియన్ సముద్రంలో పడేశారని హ్యారీ తెలిపారు. తప్పించుకునే యత్నంలో రెండుసార్లు కింద పడ్డారని, దాంతో చోక్సీకి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత చోక్సీని సముద్రం ఒడ్డున పోలీసులు పట్టుకొని విచారించారని తెలిపారు. కస్టడీలో విచారిస్తున్న సందర్భంగా తాము పట్టుకున్నది ఇంటర్‌పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన అంతర్జాతీయ నేరస్థుడని పోలీసులకు తెలిసిందని ఆయన తెలిపారు. ఆంటిగ్వా నుంచి తప్పించుకొని క్యూబా వెళ్లే యత్నంలో చోక్సీ డొమినికాలో పట్టుబడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News