Saturday, April 27, 2024

అక్టోబర్ 15న ఐపిఎల్ ఫైనల్!

- Advertisement -
- Advertisement -

IPL final on October 15!:BCCI

స్పష్టత ఇచ్చిన బిసిసిఐ

ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండో దశను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భావిస్తోంది. ఇప్పటికే ఐపిఎల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహిస్తున్నట్టు బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. అయితే ఐపిఎల్ ఎప్పుడూ ప్రారంభించేది, ఫైనల్ ఎప్పుడూ అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా సోమవారం బిసిసిఐకి చెందిన ఓ అధికారి దీనిపై ఒక స్పష్టత ఇచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఐపిఎల్ ఎప్పుడూ ప్రారంభమయ్యేది, ఫైనల్ ఎప్పుడూ జరిగేది అనే దానిపై ఓ స్పష్టమైన హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 19న ఐపిఎల్ రెండో దశకు తెరలేస్తుందని ఆ అధికారి వెల్లడించారు. అంతేగాక ఐపిఎల్ ఫైనల్ సమరం అక్టోబర్ 15న జరుగుతుందని ఆయన వివరించారు. ఇదిలావుండగా ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.

అంతేగాక తాము కోరినట్టుగానే ఆ షెడ్యూల్‌లోనే ఐపిఎల్‌ను పూర్తి చేసేందుకు ఎమిరేట్స్ బోర్డు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. రెండో దశలో మిగిలివున్న 31 విజయవంతంగా నిర్వహించేందుకు బిసిసిఐ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యుఎఇ బోర్డు సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నీని పూర్తి చేస్తామనే ధీమాను ఆ అధికారి వ్యక్తం చేశారు. ఇక ఈసారి మూడు స్టేడియాల్లో ఐపిఎల్ జరుగుతుందన్నారు. ఇందులో డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉంటాయన్నారు. కాగా, ఐపిఎల్‌లో విదేశీ క్రికెటర్లు పాల్గొంటారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. వారు రాకున్నా అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఐపిఎల్‌ను పూర్తి చేయడమే తాము లక్షంగా పెట్టుకున్నామన్నారు.

ఇక ప్రపంచకప్, ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనే విదేశీ క్రికెటర్లు మాత్రమే ఐపిఎల్‌కు దూరంగా ఉండే అవకాశం ఉందని, మిగిలిన ఆటగాళ్లను పంపించేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐపిఎల్‌ను పూర్తి బయోబబుల్ విధానంలో జరుగుతుందన్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కఠినమైన నిర్ణయాలతో ఐపిఎల్ సజావుగా సాగేలా కృషి చేస్తామన్నారు. ఇక ఈసారి ఐపిఎల్‌కు అభిమానులను అనుమతించేందుకు ఎమిరేట్స్ బోర్డు అంగీకరించిందని తెలిపారు. దీనిపై అధికారికంగా ఎలాంటి హామీ రాకున్నా ప్రేక్షకులకు అనుమతి ఇచ్చేందుకే యుఎఇ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇక ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆ అధికారి వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News