Friday, April 26, 2024

వాతావరణ మార్పు పర్యావరణానికి పెను సవాలు: ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM on climate change crop

న్యూఢిల్లీ: వాతావరణం తట్టుకునే, పౌష్టికత్వం వంటి ప్రత్యేక లక్ష ణాలు ఉండే 35 పంట రకాలను మంగళవారం ప్రధాని జాతికి అంకితం ఇస్తూ, “ వాతావరణ మార్పు నుంచి పంటలను రక్షించుకునే విజ్ఞానాన్ని విద్వావేత్తలు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు రైతులకు అందించాలి” అన్నారు. ’’వాతావరణ మార్పు పర్యావరణానికి పెను సవాలు, అందుకు తగు చర్యలు చేపట్టాలి‘ అని ఆయన పిలుపునిచ్చారు.

ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “ నేను విదావేత్తలందరు, వ్యవసాయ శాస్త్రజ్ఞులందరు, అన్ని సంస్థలకు చెప్పదలచుకునేదేమిటంటే, మీరు కూడా స్వాతంత్య్ర అమృత మహోత్సవానికి మీ లక్షాన్ని ఏర్పరచుకోండి. 75 రోజుల ఉద్యమాన్ని చేపట్టండి. 75 గ్రామాలను దత్తతకు తీసుకుని మార్పు ఉద్యమాన్ని చేపట్టండి. 75 పాఠశాలలను జాగృతపరచి ప్రతి దానిని పనిలో పెట్టేయండి” అన్నారు.

దేశంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి ఉద్యమాన్ని చేపట్టవచ్చు. వ్యక్తిగతంగాను, సంస్థాగతంగాను దీనిని చేపట్టవచ్చు. కొత్త పంటలు, మెరుగైన విత్తనాలు, వాతావరణ మార్పు నుంచి రక్షణ వంటి విషయాలను ఈ అభియాన్‌లో తెలియజేయాలన్నారు. “వాతావరణ మార్పు నుంచి మన వ్యవసాయాన్ని రక్షించుకుంటే అది రైతులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. మన దేశానికి ఆరోగ్య భద్రతనూ ఇస్తుంది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News