Friday, April 26, 2024

బట్ట మాస్కే మంచిది

- Advertisement -
- Advertisement -

Cloth masks

టొరంటో : బట్టతో తయారుచేసే మాస్క్‌లే కరోనా వైరస్ వ్యాప్తిని పరోక్షంగా తగ్గిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. నూలు తో రూపొందించే మాస్క్‌లతో కాలుష్యపు గాలిని అరికట్టవచ్చునని, ఈ విధంగా వైరస్ వ్యాప్తిని ఇవి కొంత మేరకు కట్టడి చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం మాస్క్ నిత్యావసర ముఖకవచం అయిన దశలో ఏ మాస్క్ మంచిదనే అం శంపై కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు, శాస్త్రజ్ఞులు అధ్యయనం జరిపారు. నూలు వస్త్రంతో చేసిన మాస్క్‌లు ప్రత్యేకించి పత్తి దారాలతో నేసిన తొడుగులు బాగా పనిచేస్తాయని తేల్చారు.

తుంపర్లను, పర్యావరణంలోని వాయుకణాల్లోని మలినాలను శరీరంలోకి వ్యాపించుకుండా ఈ నూలు మాస్క్‌లు పనిచేస్తాయని నిర్థారించారు. సాధారణంగా మనిషి మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడుతాయి. మనిషి నుంచి మనిషికి వైరస్‌లు సోకేందుకు ఈ ఒక్కటి పలు విధాలుగా కారకం అవుతుంది. కెనడా వర్శిటీ నిర్వహించిన అధ్యయనం వివరాలను తాజాగా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ పరిధిలో నిర్ధేశించే మాస్క్‌లే ధరించే విషయంపై కూడా అధ్యయనం జరిపారు.

ఇతరత్రా వేరే ముడిసరుకుతో తయారుచేసే మాస్క్‌లను వాడితే ఉపయోగం లేదనే విషయం నిర్థారణ కాలేదని తెలిపారు. మాస్క్‌లలో వచ్చి చేరే వైరస్ కణాలు తిరిగి గాలిలో కలవడం, మాస్క్‌ను తాకడం ద్వారా వ్యాపించడం వంటివి ఏమీ ఉండవని కూడా గుర్తించారు. అయితే ప్రస్తుత సార్స్ కోవ్ 2 వైరస్ వ్యాపించకుండా నూలు మాస్క్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తాయనడానికి ప్రత్యక్ష సాక్షం ఏదీ లేదని, అయితే కాలుష్యపు గాలి పీల్చుకోకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడుతాయని, ఈ మేరకు మాస్క్‌ల వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందని అధ్యయనంలో కాథరైన్ క్లాసే తెలిపారు.

Cloth masks may help reduce Corona transmission

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News