Friday, April 26, 2024

సిఎం కెసిఆర్ క్రికెట్ ట్రోఫి..సీజన్-3

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా సిద్దిపేట మీని స్టేడియంలో నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్ ట్రోఫి మూడవ సీజన్ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కల్వకుంట్ల మల్లికార్జున్‌లు అన్నారు. గురువారం మీని స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రికెట్ ట్రోఫి 3 పోస్టర్ ,ఆఫ్టికేషన్ ఫామ్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగలుగుతున్నామంటే స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన మంత్రి హరీశ్‌రావు ముఖ్య కారణమన్నారు. నిర్వాహణకు గ్రౌండ్‌లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పనులు పూర్తి కాగానే టోర్నమెంట్ ప్రారంభిస్తామని తెలిపారు.

టోర్నిలో ఒక్కొక్క గ్రామం నుండి కానీ ,వార్డు నుండి కానీ ఒకే జట్టుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. టోర్నమెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కు సంబంధించిన రిఫరీలు ఎంపైర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అంతర్జాతీయ నియమ నిబంధనలతో టోర్ని కొనసాగుతుందన్నారు. అలాగే టోర్ని విన్నర్‌కు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి, రెండవ బహుమతి లక్ష రూపాయల నగుదుతో పాటు మ్యన్ ఆఫ్‌ద సీరిస్ 50 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు. ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రథమ కనపరిచిన వారికి మ్యాన్‌ ఆప్‌ద మ్యాచ్ 1000 రూపాయల నగదు, అలాగే సిక్స్ కొట్టిన వారందరికి ప్రతి సిక్స్‌కు రూ. 500 రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు. జట్టు సభ్యులు ప్రతి ఒక్కరు తమ ఆదార్ కార్డును జతచేయాల్సి ఉంటుందన్నారు.

ఒక జట్టులో ఆడిన క్రీడాకారునికి మరోక జట్టులో ఎట్టి పరిస్ధితుల్లో అవకాశం ఉండదని ఒకవేళ అలా గనుక చేస్తే జట్టును క్రాస్ చేస్తామని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు ఈ నెల 13 ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లికార్జున్, నాగరాజురెడ్డి, ప్రవీణ్‌కుమార్, సాయికుమార్ గౌడ్, నాయకులు బుచ్చిరెడ్డి, ప్రశాంత్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News