Monday, May 13, 2024

రైతులకు సిఎం కెసిఆర్ గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

CM KCR Good News For Corn Farmers

హైదరాబాద్: మెుక్కజోన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మద్దతు ధర చెల్లించి వరిపంటతో పాటు మక్కలు కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. క్వింటాల్ మక్కలకు రూ. 1,850 మద్దతు ధర చెల్లిస్తామని సిఎం సూచించారు. మార్క్ ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలుచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించిన సిఎం కెసిఆర్… గ్రామాల్లోనే వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదనందున వానాకాలం మక్కజోన్న వద్దని కోరినం. ప్రభుత్వం వద్దని చెప్పినా రైతులు మక్కజోన్న సాగు చేశారన్నారు.

వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదన్నారు. కొన్ని జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా మక్కజోన్న వేయాలని సూచించినం. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు పాటించలేదని తెలిపారు. రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి.. మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతు సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం రైతులను సంఘటిత శక్తిగా మలిచిందని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటిసారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలవుతోందని ఆయన వెల్లడించారు. రైతుల భూములు దగ్గర లక్ష కల్లాల నిర్మాణం చేపట్టినమన్న సిఎం రాష్ట్రంలో 2600 రైతు వేదికలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

CM KCR Good News For Corn Farmers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News