Friday, May 3, 2024

భృతిపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలవుతున్న తీరుపై వివరాలు సేకరించిన ఆర్థిక శాఖ
అంతకంటే మెరుగైన విధానానికి వీలుగా నివేదికల రూపకల్పన
ప్రగతిభవన్ సమావేశంలో ప్రస్తావన

Sweta Mohanty inspecting at GHMC Council Hall

కేరళలో ఎస్‌ఎస్‌సి పాసైన మూడేళ్ల తర్వాత నుంచి 18-35ఏళ్ల వారికి నెలకు రూ.120, మధ్యప్రదేశ్‌లో ఇంటర్, ఆ పైన చదివిన 22-35ఏళ్ల వారికి రూ.1000, రాజస్థాన్‌లో ఇంటర్ పాస్ అయిన వారికి రూ.650, యువతులకు రూ.750, ఎపిలో డిగ్రీ, రెండేళ్ల డిప్లమా పాస్ అయిన వారికి రూ.1000, హర్యానాలో 10పాస్ అయిన వారికి రూ.100, ఇంటర్ పాస్ అయిన వారికి రూ.900, పట్టభద్రులకు రూ.1500, పిజి చేసిన వారికి రూ.3000 చత్తీస్‌గఢ్‌లో ఇంటర్ పాస్ అయిన వారికి రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నట్టు సమాచారం.

మనతెలంగాణ/హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు నెరవేబోతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతినెల భృతి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున ఈ అంశంపై ఉన్నతస్ధాయిలో కరసత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వ విధివిధానాలు, అమలు తీరు తదితర అంశాలపై రాష్ట్ర ఆర్ధిక శాఖ యంత్రాగం ఇప్పటికే సమగ్రంగా వివరాలను సేకరించింది. ఆ రాష్ట్రాలకంటే మెరుగైన రీతిలో ఈ పధకాన్ని అమలు చేసేందుకు నివేదికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదముద్ర పడితే ఇక రానున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి పధకం ..నిధుల కేటాయింపులకు లైన్ క్లియర్ కానుంది. నిరుద్యోగ భృతిపై గురువారం ప్రగతి భవన్‌లో ఆర్ధిక శాఖ అధికారులతో సిఎం కెసిఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉపాధి లేనివారికి మెరుగైన నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. తదనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించాలని సిఎం ఆదేశించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి 2018నాటి అసెంబ్లీ ఎన్నికల్లోనే నిరుద్యోగభృతిపై హామీ ఇచ్చింది. తదనుగుణంగా 2019..20-20బడ్జెట్‌లో రూ.1810కోట్లు నిధులు కూడా కేటాయించింది. అయితే విధివిధానాలు ఖరారు కాకపోవటంతో ఈ పధకం అమలుకు నోచుకోలేదు. అయితే ఇటీవల పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ చేసిన ప్రకటనతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న రాష్ట్రాల్లో నిరుద్యోగి కుటుంబ వార్షిక ఆదాయం ప్రామాణికంగా తీసుకున్నారు. ఎపి,హర్యాణ, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.2లక్షలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో రూ.3లక్షలు వార్షిక ఆదాయంగా సీలింగ్ అములు చేస్తున్నారు. భృతి కోరుకునే వారిలో కేరళలో ఎస్ ఎస్‌సి ఉత్తీర్ణులైన మూడేళ్ల తర్వాత నుంచి 18-35ఏళ్ల మధ్యనున్న వారికి నెలకు రూ.120 భృతి ఇస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇంటర్, ఆ పైన చదివిన వారికి 22…-35ఏళ్ల మధ్యనున్న వారికి రూ.1000 అందచేస్తోంది. రాజస్థాన్‌లో కూడా ఇంటర్ పాస్ అయిన యువకులకు రూ.650, యువతులకు రూ.750 భృతి ఇస్తోంది. ఎపిలో డిగ్రీ, రెండేళ్ల డిప్లమా పాస్ అయిన వారికి రూ.1000 భృతిగా ఇస్తోంది. హర్యాణలో 10పాస్ అయిన వారికి రూ.100, ఇంటర్ పాస్ అయిన వారికి రూ.900 డిగ్రీ వున్న వారికి రూ.1500, పిజి వారికి రూ.3000 భృతిగా ఇస్తోంది. చత్తీస్‌గఢ్‌లో ఇంటర్ పాస్ అయిన వారికి రూ.1000ఇస్తున్నారు. వీటిని అధ్యయనం చేసిన అధికారులు ఒక నివేదికను సిద్ధం చేసి సిఎంకు అందజేశారు.
ప్రాధమిక అంచనా వ్యయం రూ.3500కోట్లు పైమాటే
తెలంగాణ రాష్ట్రంలో నిరుధ్యోగ భృతికోసం అర్హుతగల వారు సుమారు 10లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అధికారులు ఇప్పటికే ఒక అంచనాకోచ్చారు. ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విధంగా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3016 ఇవ్వాల్సివస్తే ఏటా సుమారు రూ.3500నుంచి4000కోట్ల మేరకు వ్యయం చేయాల్సివస్తుందని అర్ధికశాఖ వర్గాలు అంచనావేస్తునాయి. అయితే నిరుద్యోగిగా ఉన్న వారిని గుర్తించేందుకు విద్యార్హతలు, కుంటుంబ వార్షిక అదాయం, ప్రైవేటు రంగాల్లో చిరుద్యోగాలు చేస్తున్న వారిని కూడా లెక్కలోకి తీసుకోవాలా వద్దా తదితర అంశాలపై త్వరలోనే విధివిధానాలు ఎంపిక చేయనున్నారు.

CM KCR review meeting on unemployment benefits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News