Saturday, May 4, 2024

దళితబంధుపై సిఎం కెసిఆర్ స్పెషల్ ఫోకస్

- Advertisement -
- Advertisement -

CM KCR to Hold Review Meeting on Dalit Bandhu Scheme

రేపు ప్రగతి భవన్‌లో సన్నాహాక సమావేశం
నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్ : దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ పథకాన్ని దేశానికే రోల్ మోడల్‌గా చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఇప్పటికే సిఎం కెసిఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో అమలు చేశారు. తదనంతరం పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలంలో దళిత బంధును అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఇప్పటికే ఎంపిక చేశారు. ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నేడు జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్‌సి కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్‌సి డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సిఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ తదితరులు పాల్గొనున్నారు. అలాగే ఈ పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News