Friday, May 3, 2024

ఈనెల 7 నుంచి జెబిఎస్-ఎంజిబిఎస్‌ మెట్రో రైలు పరుగులు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జూబ్లీబస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మగాంధీ బస్‌స్టేషన్(ఎంజిబిఎస్) వరకు మెట్రో ట్రైన్ ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మార్గాన్ని వచ్చే 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్‌లో మంగళవారం వెల్లడించారు. ఈ మెట్రో మార్గం ప్రారంభోత్సవంతో మెట్రో రైలు ప్రయాణ సౌలభ్యం మొత్తం 67 కి.మీ.లు హైదరాబాద్ నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఈ మార్గం ప్రధానంగా జెబిఎస్, ఎంజిబిఎస్ రెండు అంతరాష్ట్ర బస్ స్టేషన్‌లను అనుసంధానం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెరుగైన రవాణా సౌలభ్యం అందుబాటులోకి రానున్నది. జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు 9 స్టేషన్‌లు 11 కి.మీ.లు దూర ప్రయాణం హైదరాబాద్ నగరవాసులకే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు, పర్యాటకులకు రవాణా సదుపాయం ఉంటుంది.
67 కి.మీ.లు అందుబాటులోకి…
పథకం శంకుస్థాపన 26 ఎప్రిల్, 2012న జరిగింది. 29 కి.మీ.లు, 27 స్టేషన్‌లున్న నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకున్న మార్గాన్ని నవంబర్ 28, 2017 రోజున మెట్రో రైలు మొదటి ప్రారంభోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోది చేశారు. 29 నవంబర్ నుంచి ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. 29 కి.మీ.లున్న మియాపూర్ నుంచి ఎల్‌బినగర్ వరకు సెప్టెంబర్ 24, 2018 న ప్రారంభమైంది. మార్చి 20, 2019న అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు 8.5 కి.మీ.లు (ఒకే మార్గం), అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు రెండు మార్గాల్లో మెట్రోలో ప్రయాణించడం ఆగష్టు 20, 2019న మొదలైంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో మార్గం 1.5 కి.మీ.లు నవంబర్ 29, 2019న ప్రారంభమైంది. మే 19, 2019 వరకు ఓల్డ్ సిటీలో 6 కి.మీ.లు మినహాయించి 2,599 పిల్లర్ల ఏర్పాటుతో కూడిన 66 కి.మీ.ల మేర మెట్రో మార్గం నిర్మాణం పూర్తయింది.
ఇదీ పథకం
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పిపిపి) పద్దతిలో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైలు పథకం మొత్తం 72 కి.మీ.లు. నాగోల్ – రాయదుర్గం(28 కి.మీ.లు, 23 స్టేషన్‌లు), మియాపూర్ – ఎల్‌బినగర్(29 కి.మీ.లు 27 స్టేషన్‌లు), జెబిఎస్ – ఫలక్‌నుమా(15 కి.మీ.లు.) అయితే, ప్రస్తుతం 11 కి.మీ.లుగా ఉన్న జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు 9 స్టేషన్‌ల మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మూడు మార్గాల్లో 67 కి.మీ.లు 59 స్టేషన్‌ల నిర్మాణం చేపట్టేందుకు వ్యయం రూ. 18,800 కోట్లు అంచనాగా ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో మార్గంలో జనవరి 2020 లెక్కల ప్రకారం ప్రతిరోజు 4.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

CM KCR Will Inaugurate JBS-MGBS Metro Rail on Feb 7th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News