Sunday, April 28, 2024

మేడారం జాతరకు 3,956 ఆర్‌టిసి బస్సులు

- Advertisement -
- Advertisement -

TSRTC

 

హైదరాబాద్: తెలంగాణలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే సమ్మక్క..సారలమ్మ జాతరకు ఆర్‌టిసి విస్తృతంగా సేవలందిస్తున్నది. మేడారంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారం గద్దె వరకు 3,956 బస్సులు నడుపుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు మొత్తం కలిపి 12వేల మంది ఈ సర్వీసులు నడుపుతున్నారు. ఆర్‌టిసి ఉన్నతాధికారులయిన ముగ్గురు కార్యనిర్వహణ సంచాలకులు(ఇడిలు) ఇక్కడే ఉండి మరీ ఆయా బస్సులను పర్యవేక్షిస్తున్నారు.

ఈ నెల 5వ తేదీ నుంచి 9 వరకు జరిగే ఈ జాతరకు విశేషసంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరలో పాల్గొనేవారికి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌టిసి ఎక్కడికక్కడ సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటుచేసింది. రూట్ల వివరాలతో పాటు బస్సు వేళలు తెలియజేప్పే కేంద్రాలు ప్రయాణికులకు అందుబాటులో ఏర్పాటుచేసినట్లు ఆర్‌టిసి వర్గాలు వెల్లడించాయి. సమ్మక్క..సారలమ్మ జాతర జరిగే ఐదు రోజుల పాటు ఆర్‌టిసి బస్సులు విరివిగా ప్రజలకు అందుబాటులో నడుపుతున్నారు.

RTC To Operate 3956 Buses To Medaram Jatara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News