Sunday, May 12, 2024

పైసల కోసం పసిపిల్లల విక్రయం

- Advertisement -
- Advertisement -

Police

హైదరాబాద్: నగరంలో పసిపిల్లను విక్రయించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా విక్రయిస్తున్న ముఠాలో ఎపికి చెందిన 9 మంది సభ్యులను పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో తండాల్లో ఉన్న మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఈ ముఠా చిన్నపిల్లల విక్రయించే దందా కొనసాగిస్తోంది. కేవలం రూ. 70వేలకు కొనుగోలు చేసి అపై పసిపిల్లలను రూ. 10 లక్షల నుంచి 14 లక్షలకు శిశువులను విక్రయిస్తున్నారు.

అయితే ఈ ముఠాలకు సంతాన సాఫల్య కేంద్రాలు సహకరిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువులను అమ్మే తల్లికి కేవలం 70వేలు మాత్రమే చెల్లించి బయట 14లక్షలకు విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లోని సంతాన సాఫల్య కేంద్ర నుంచి ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోన్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ దందాపై తెలంగాణ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో 14 మంది ఆడ, మగ శిశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది.

బాలుడిని విక్రయిస్తూ మరో ముఠా అరెస్ట్

నగరంలోని ఎస్సార్ నగర్‌లో బాలుడిని విక్రయిస్తున్న ఘటనలో ఆరుగురు నిందితులను మంగళవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలుడిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు, కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు ఉన్నారు. ఈక్రమంలో నగరంలోని బోరుబండకు చెందిన దంపతులు మధ్యవర్తి సహాయంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో అల్మస్ హోటల్ వద్ద బాలుడిని విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని బాలున్ని శిశువిహార్‌కు తరలించారు.

Police have arrested a gang that sold childs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News