Sunday, May 12, 2024

ఢిల్లీలో గజగజల నవంబర్

- Advertisement -
- Advertisement -

Coldest November in Delhi in 71 years

న్యూఢిల్లీ : ఢిల్లీ ఇప్పుడు గజగజ వణికిపోతోంది. 71 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా దేశ రాజధానిలో నవంబర్‌లో అత్యంత శీతల స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయం సోమవారం భారత వాతావరణ పరిశోధక విభాగం (ఐఎండి) తెలిపిన వివరాల మేరకు స్పష్టం అయింది. దేశ రాజధాని ఢిల్లీ 71 ఏండ్లలో ఎప్పుడూ లేని రీతిలో అతిశీతల నవంబర్ నెలగా మారింది. 1949లో ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. 1938లో ఇది 9.6 డిగ్రీలుగా ఉంది. 2018లో ఇది 13.4 శాతంగా ఉంది.

ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనీస స్థాయిలో చూస్తే పది డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తున్నాయి. నవంబర్‌లో 3వ తేదీ, 20,23,24 తేదీలలో అత్యం త శీతల గాలులు వీచాయి. కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ స్థాయిలో ఉంటే సాధారణంగా ఐఎండి శీతల గాలుల పరిణామాన్ని హెచ్చరిస్తుంది. ఇక సోమవారం (30వ తేదీ) ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత 6.9 డిగ్రీ సెల్సియస్‌గా రికార్డు అయింది. 2003 నుంచి చూస్తే ఢిల్లీలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. అప్పట్లో కనీస ఉష్ణోగ్రతలు 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయినట్లు ఐఎండి డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.

Coldest November in Delhi in 71 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News