Monday, April 29, 2024

ఇంటర్నెట్ లేని సమయంలో ప్రేమలు ఎలా ఉన్నాయి?

- Advertisement -
- Advertisement -

అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. ఈ చిత్రంలో సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించగా సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈనెల 23న ‘ఆహా’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాయి రాజేష్‌తో ఇంటర్వూ విశేషాలు…
రాసుకున్న కథ ఇచ్చి…
ఈ చిత్ర దర్శకుడు సందీప్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. అతనికి నేను రాసుకున్న కథ ఇచ్చి… నేనే నిర్మాతగా మారి ‘కలర్‌ఫొటో’ చిత్రాన్ని తీశాను. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది.
నిజాయితీగా చెప్పే ప్రయత్నం…
రంగు వివక్ష గురించి ఈ సినిమాలో చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేశాము. ప్రేక్షకులకు కావాల్సినంత హ్యూమర్, ఎమోషన్స్‌తో మేము అనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పాము.
నటనాపరంగా నిరూపించుకున్నాడు…
ఈ సినిమాలో సుహాస్ నటనా పరంగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ కథకి అతను సరిగ్గా సరిపోతాడని మా యూనిట్ అందరం ఓ నిర్ణయానికి వచ్చాకే అతన్ని తీసుకోవడం జరిగింది.
ఆమె నటన నచ్చుతుంది…
చాందినీ ఈ కథకు సూట్ అవుతుందా అని ముందు సందేహించాను. కానీ తర్వాత ఆమె నటన చూసి నేను అనవసరంగా సందేహించానని అనిపించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను.
హ్యాపీగా అనిపించింది…
మా బ్యానర్‌లో వచ్చిన రెండు సినిమాలు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలు కమర్షియల్ హిట్స్ అయినప్పటికీ మా బ్యానర్‌కి రావాల్సిన గౌరవం రాలేదని నాకు అనిపించింది. దాని కోసమే ఎవరైనా కొత్త వాళ్లతోనే ఓ సినిమా తీసి సక్సెస్ అవుదామని నిర్ణయించుకొని ‘కలర్‌ఫొటో’ని నిర్మించాను. అయితే సినిమా విడుదల కాకుండానే కేవలం టీజర్‌తోనే నా బ్యానర్‌కి కావల్సినంత గౌరవం, గుర్తింపు వచ్చేశాయి. చాలా మంది ఇండస్ట్రీ వారు ఫోన్లు చేసి మెచ్చుకోవడం హ్యాపీగా అనిపించింది.
అప్పట్లో ప్రేమలు ఎలా ఉన్నాయి…
ఈ చిత్రం ఈనెల 23న ‘ఆహా’లో విడుదల కానుంది. 1990-97 సంవత్సరాల సమయంలో జరిగిన ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లేని సమయంలో ప్రేమలు ఎలా ఉన్నాయి? ఎలా కలుసుకునేవారు? ఎలా మాట్లాడుకునేవారు? వంటి అంశాలను ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

Color Photo movie Director Sandeep Raj Interview

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News