Wednesday, May 15, 2024

పంజాబ్ రాత మారుతుందా?

- Advertisement -
- Advertisement -

పంజాబ్ రాత మారుతుందా?

అందరి దృష్టి క్రిస్ గేల్‌పైనే.. నేడు బెంగళూరుతో సమరం

షార్జా: వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ సవాలుగా మారింది. రానున్న ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఆరింటిలో రాహుల్ సేనకు ఓటమి తప్పలేదు. అయితే యూనివర్సల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది పంజాబ్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం గా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గేల్ తుది జట్టులో చేరితే జట్టు ఆత్మవిశ్వాసం రెట్టిం పు అవుతుందనడంలో సందే హం లేదు. అయితే మరో దిగ్గజం మాక్స్‌వెల్ వైఫల్యం పంజాబ్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు ఆడి న ఏడు మ్యాచుల్లోనూ మాక్స్‌వెల్ విఫలమయ్యాడు. ఇన్ని మ్యాచ్‌లు ఆడినా ఇప్పటిదాక ఒక్క సిక్స్ కూడా కొట్టక పోవడం అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగుతుం దో ఊహించుకోవచ్చు. భారీ ఆశలు పెట్టుకున్న మాక్స్‌వెల్ వరుస వైఫల్యాలు చవిచూస్తుండడంతో పంజాబ్‌కు పరాజయా లు తప్పడం లేదు. ఇక లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో రాణిస్తు న్నా సారథిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. నిలకడగా రాణిస్తున్నా జట్టును విజయపథంలో మాత్రం నడిపించలేక పోతున్నాడు. మరోస్టార్ మయాంక్ అగర్వాల్ ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో దాంట్లో విఫలమవుతున్నాడు. అతని బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. నికోల స్ పురాన్ అడపాదడపా రాణిస్తున్నా జట్టు ను మాత్రం గెలిపించలేక పోతున్నాడు. బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. మహ్మద్ షమి వంటి అగ్రశ్రేణి బౌలర్ ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ఇదిలావుండగా రానున్న మ్యాచు ల్లో నిలకడైన విజయాలు సాధిస్తే మాత్రం పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచే అవకాశాలుంటాయి.
జోరుమీదున్న కోహ్లి సేన..
ఇక బెంగళూరు వరుస విజయాలతో ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్3లో చోటు సంపాదించింది. ఈసారి కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. డాషింగ్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ భీకర ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. యువ ఆటగాడు పడిక్కల్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఈసారి కూడా ఫించ్‌తో కలిసి శుభారంభం అందించాలనే పట్టుదలతో పడిక్కల్ ఉన్నాడు. ఫించ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్ విరాట్ కూడా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. ఇలా టాపార్డర్ అంతా ఫామ్‌లో ఉండడం బెంగళూరు కలిసివస్తోంది. మరోవైపు బౌలర్లుకు కూడా అసాధారణ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చాహల్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైని తదితరులు నిలకడగా రాణిస్తున్నారు. ఈసారి కూడా సమష్టిగా రాణించి మరో విజయం అందుకోవాలనే పట్టుదలతో బెంగళూరు మ్యాచ్‌కు సిద్ధమైంది.

IPL 2020: KXIP vs RCB Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News