Monday, May 6, 2024

నాగ్‌పూర్‌లో మళ్లీ లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Complete lockdown in Nagpur

ముంబై: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా నాగ్‌పూర్ లో మార్చి 15 నుండి మార్చి 21 వరకు ఒక లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్‌లు వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మహారాష్ట్రలో గత నెల రోజులుగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ అనివార్యమైన కొన్ని ప్రదేశాలు ఉండవచ్చని, దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 13,659 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసులలో దాదాపు 60 శాతం. భారతదేశంలో అత్యధికంగా కోవిడ్ కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News