Wednesday, May 1, 2024

సిఎం కెసిఆర్ ను దూరం పెట్టిన కాంగ్రెస్..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 136 సీట్లను గెలిచి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఈరోజు(శనివారం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, సిఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డికె శివ కుమార్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో గత వారం రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో అదిష్టానం వారిని ఢిల్లీకి పిలిపించి బుజ్జగింపులు జరిపింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెర దించుతూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డికె శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

దీంతో ఈ రోజు మధ్యాహ్నం కర్నాటకలోని కఠీవర స్టేడియంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి తమిళనాడు సిఎం స్టాలిన్, బెంగాల్ సిఎం మమత బెనర్జీ, బీహార్ సిఎం నితీశ్‌కుమార్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ లతోపాటు పలువురు ప్రముఖులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.అయితే, పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆహ్వానించలేదు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో అడుగు పెట్టి, ప్రధాని మోడీపై యుద్ధం ప్రకటించిన సిఎం కెసిఆర్, అదే సమయంలో కాంగ్రెస్ తో జతకట్టాలని భావిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం సిఎం కెసిఆర్ ను నమ్మేదేలేదని, దూరంగా ఉంచుతేనే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కర్నాటక సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావాలనే కెసిఆర్ ను కాంగ్రెస్ ఆహ్వానించలేదంటూ ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News